ఇండియన్స్ కి దుబాయ్ గుడ్ న్యూస్... తెరపైకి సరికొత్త వీసా!!
అవును... వీసా రహిత పర్యటన కార్యక్రమాలను పలుదేశాలు అవలంభిస్తున్న వేళ... భారతీయుల కోసం దుబాయ్ కూడా ఒక సరికొత్త వీసా ను తెరపైకి వచ్చింది.
కోవిడ్ అనంతరం జరిగిన పరిణామాలతో దాదాపు చాలా దేశాలు టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని దేశాలు, పలు దేశాలకు వీసా లేకుండానే వారి వారి దేశాల్లో పర్యటించే అవకాశాలను కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా థాయిలాండ్, శ్రీలంక దేశాలకు భారతీయులకు 30 రోజులపాటు వీసాలు లేకుండానే వెళ్లే అవకాశాన్ని కల్పించాయి. అయ్తిఏ ఈ ఆఫర్ కు టైం లిమిట్ పెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ కూడా కీలక ప్రకటన చేసింది.
అవును... వీసా రహిత పర్యటన కార్యక్రమాలను పలుదేశాలు అవలంభిస్తున్న వేళ... భారతీయుల కోసం దుబాయ్ కూడా ఒక సరికొత్త వీసా ను తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసా ను రూపొందించింది. ఈ విషయాన్ని దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (డీఈటీ)ను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. ఈ వీసా ఏమిటి.. ఈ వీసా వల్ల ఉపయోగాలేమిటి.. దీన్ని పొందాలంటే ఉన్న కండిషన్స్ ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం...!
భారతీయ టూరిస్టుల కోసం దుబాయ్ ఒకసారికొత్త వీసాని తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... "మల్టిపుల్ ఎంట్రీలెవెల్ ట్రావెల్ వీసా"ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఇలాంటి సౌకర్యాన్ని గల్ఫ్ దేశాలకు వర్తించేలా ప్లాన్ చేస్తుంది! ఈ సరికొత్త విధానం ద్వారా భారతీయులు టూరిస్ట్ వీసా ద్వారానే దుబాయ్ కి ఐదేళ్లలో పలుమార్లు వెళ్లిరావొచ్చు. ఇదే సమయంలో వెళ్లిన ప్రతీసారి 90రోజుల పాటు అక్కడ ఉండి రావొచ్చు. అయితే ఏడాదిలో 180 రోజులు మించి మాత్రం ఉండకూడదు.
ఈ నేపథ్యంలో ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ను రెండు నుంచి ఐదు వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా అర్హులైన వారు కొన్ని కచ్చితమైన అంశాలను పాటించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా... వీసాకు ధరఖాస్తు చేసుకునే నాటికి.. గత ఆరునెలల్లో బ్యాంక్ ఖాతాలో సుమారు 4,000 డాలర్లు లేదా అంతకు సమానమైన ద్రవ్యాన్ని కలిగి ఉండాలి!! అదేవిధంగా దుబాయ్ లో కూడా చెల్లుబాటయ్యేలా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరైగా కలిగి ఉండాలి!
కాగా... దుబాయ్ కి టూరిస్టులుగా భారతీయులు ఎక్కువగానే వెళ్తారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2023లో దుబాయ్ ను సుమారు 2.46 మిలియన్ల మంది ఇండియన్స్ సందర్శించగా... సందర్శించారు. కొవిడ్-19 ముందునాటి పరిస్థితితో పోలిస్తే ఇది దాదాపు 25 శాతం అధికం కావడం గమనార్హం!