తప్పే కానీ తప్పలేదు.. మాధురి విషయంలో దువ్వాడ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

ఆ స్థాయిలో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఇటీవల తిరుమలలో కనిపించారు దువ్వాడ శ్రీనివాస్ - మాధురి!

Update: 2024-10-09 16:52 GMT

గడిచిన ఆగస్టు నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత హట్ టాపిక్ గా నడిచిన అంశాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఇటీవల తిరుమలలో కనిపించారు దువ్వాడ శ్రీనివాస్ - మాధురి!

ఈ సందర్భంగా వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విడివిడిగా వివాహితులైన వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు! న్యాయపరమైన చిక్కులు సమసిపోయిన అనంతరం వివాహం చేసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ ఛానల్ లోని ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు పంచుకున్నారు.

అవును... అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ లో కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ - మాధురిలు కలిసి తొలిసారిగా ఓ టీవీ ఛానల్ లోని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెప్పాలనుకున్న విషయాన్ని వీలైనంత స్పష్టంగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం!

ఈ సందర్భంగా స్పందించిన దువ్వాడ శ్రీనివాస్... వాణితో తనకున్న 28 ఏళ్ల దాంపత్య జీవితంలో కేవలం రెండేళ్లు మాత్రమే సంతోషంగా ఉన్నట్లు గుర్తని చెప్పుకొచ్చారు. అనంతరం... మాధురిని రాజకీయాల్లోకి తెచ్చిందే మా కుటుంబం అని చెప్పిన దువ్వాడ.. అంతక ముందు ఆమె భరతనాట్యం ప్రొఫెసర్ అని.. అయితే తమకు ఉపయోగపడుతుందనే మాధురిని రాజకీయాల్లోకి వాణి తెచ్చినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా స్పందించిన మాధురి... ఈ ప్రపంచానికి తాను పడుతున్న ఇబ్బందులు, ఈ వ్యవహారం అంతా తెలిసింది కేవలం రెండు నెలల నుంచి మాత్రమే అని.. కానీ, సుమారు రెండేళ్లుగా ఈ సంఘటనలు అన్నీ జరుగుతున్నట్లు తెలిపారు. 2023లోనే శ్రీనివాస్ తో విడాకులు కావాలని వాణి అడగడం జరిగిందని మాధురి వెల్లడించారు.

వాణి.. శ్రీనివాస్ తో విడాకులు కావాలని కోరిన తర్వాతనే.. నా వల్లే శ్రీనివాస్ సఫరయ్యారేమో అని భావించి అప్పటి నుంచీ ఆయనకు దగ్గరగా ఉండటం జరిగిందని మాధురి తెలిపారు. ఇక, తనకు శ్రీనివాస్ పై తొలుత అభిమానం ఉందని.. అయితే ఆయన పడుతున్న బాధలు చూసిన తర్వాత ఇష్టం ఏర్పడిందని, కలిసి ఉండాలనిపించిందని తెలిపారు.

ఈ క్రమంలో విడివిడిగా వివాహితులైన ఇద్దరు వ్యక్తులు ఇతరులతో కలిసి ఉండటం అనేదే ఇక్కడ అసలు విషయం అని స్పందించిన దువ్వాడ... సుప్రీంకోర్టు 2018లో 497 సెక్షన్ ప్రకారం ఒక మహిళ, మరో పురుషుడు కలిసి ఉంటే దాన్ని అడల్ట్రీ అంటారని.. దీన్ని నేరం కింద పరిగణించలేమని చెప్పిందంటూ చెప్పుకొచ్చారు!

ఇలా వేరే మహిళతో వివాహం అయిన పురుషుడు, మరో పురుషిడితో వివాహం అయిన స్త్రీ కలిసి ఉండటం అనేది సమాజం పరంగా తప్పే కానీ.. చట్ట ప్రకారం కాదని దువ్వాడ క్లారిటీ ఇచ్చారు!! ఇక ఓ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా తన దృష్టిలో, సంఘం దృష్టిలో తాను చేస్తున్నది తప్పే అని.. అయితే వ్యక్తిగతంగా తనకు తప్పదని దువ్వాడ తెలిపారు.

Tags:    

Similar News