తెలివంటే నీదే బ్రో... వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ‌పై ట్రోల్స్‌

నా దగ్గర తుపాకీ ఉంది.. దానికి లైసెన్స్ ఇవ్వండి!! అంటూ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల‌ను ఆశ్ర‌యించా రు.

Update: 2024-08-09 10:13 GMT

తెలివంటే నీదే బ్రో.. అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ.. ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస రావును ఉద్దేశించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వైర‌ల్ అవుతున్నాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న చిత్ర‌మైన ద‌ర‌ఖా స్తు చేసుకుని.. కొత్త చిక్కుల్లో చిక్కుకోవ‌డ‌మే. ఇప్ప‌టికే ఆయ‌న కుమార్తెలు ఇద్ద‌రూ.. దువ్వాడ ఇంటి ముం దు నిర‌స‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న గురించి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇప్పుడు మ‌రో వ్య‌వ‌హారంతో ఆయ‌నే తెర‌మీదికి వ‌చ్చారు.

నా దగ్గర తుపాకీ ఉంది.. దానికి లైసెన్స్ ఇవ్వండి!! అంటూ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వాస్త‌వానికి తుపాకీ కోసం ద‌ర‌ఖాస్తు చేస్తారు.. త‌ప్ప‌.. తుపాకీ ఉంది.. లైసెన్సు ఇవ్వ‌మ‌ని ఎవ‌రూ అడ‌గ‌రు. అడ‌గ‌కూడ‌దు కూడా. ఇదేమీ.. ఆట‌వ‌స్తువు కాదుక‌దా! మ‌రి ఈ విష‌యంలో దువ్వాడ బాగానే బొల్తా ప‌డ్డాడు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేందర్ రెడ్డికి తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.

తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంత మంది తన ఇంటి వద్ద అను మానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. అయితే.. ఇక్క‌డే పోలీసుల‌కు అనేక అనుమానాలు వ‌చ్చాయి. ఆయ‌న ద‌రఖాస్తును ప‌క్క‌న పెట్టి వారి అనుమానాలు తీర్చుకునే ప‌నిలో ప‌డిన‌ట్టు తెలిసింది. అస‌లు తుపాకీ ఎక్క‌డ నుంచి వ‌చ్చింది? ఎప్పుడు వ‌చ్చింది? దీనికి ముందుగానే లైసెన్సు ఎందుకు తీసుకోలేదు? వంటి స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌తో దువ్వాడ‌కు క‌బురు పంపారు.

దీంతో వారి ప్ర‌శ్న‌ల‌కు దువ్వాడ స‌రైన స‌మాధానం క‌నుక చెప్ప‌క‌పోతే.. మొత్తానికే పూర్తిగా పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఎదురు కేసు పెట్టే అవ‌కాశం ఉంది. నిజానికి తుపాకీ కావాలంటే సంబంధిత ద‌ర‌ఖాస్తును.. దానికి మ‌ద్ద‌తుగా ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలి. ఈ క్ర‌మంలో పోలీసులు విచార‌ణ చేసి.. జిల్లా మేజిస్ట్రేట్ అయిన క‌లెక్ట‌ర్‌కు నివేదిక ఇస్తారు. దానిని ఆర్డీవోకు కూడా ఇస్తారు. ఇద్ద‌రూ విచార‌ణ చేసి తుది నిర్ణ‌యం తీసుకుంటారు. ఇవేవీ లేకుండా. . త‌న ద‌గ్గ‌ర తుపాకీ ఉంద‌ని లైసెన్సు ఇవ్వాల‌ని కోర‌డంపై నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Tags:    

Similar News