కోర్టు రూమ్ వీడియో వైరల్.. జడ్జి తొలగింపు!
అవును... ద్వారకా కోర్టు జడ్జి అమన్ ప్రతాప్ సింగ్ కోర్టు రూమ్ లోని ప్రవర్తన కారణంగా న్యాయమూర్తిగా ఆయన సేవలను తక్షణమే రద్దు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది!
By: Tupaki Desk | 17 Oct 2024 12:30 AM GMTఇటీవల కోర్టు హాలులో జడ్జి ప్రవర్తనకు సంబంధించి ఓ వీడియో వైరల్ గామారింది. ఇందులో భాగంగా... ద్వారకా కోర్టు జడ్జి అమన్ ప్రతాప్ సింగ్ ఆ వీడియోలు చాలా ఆవేశంగా కనిపించారు! ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం ఆయన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయన సేవలను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపింది.
అవును... ద్వారకా కోర్టు జడ్జి అమన్ ప్రతాప్ సింగ్ కోర్టు రూమ్ లోని ప్రవర్తన కారణంగా న్యాయమూర్తిగా ఆయన సేవలను తక్షణమే రద్దు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది! ఈ మేరకు ఢిల్లీలోని న్యాయ వ్యవహారాల శాఖ అక్టోబర్ 10న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీర్స్ రుల్స్ ని ప్రస్థావించింది.
ఇందులో భాగంగా... ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్, 1970 నిబంధలను అనుసరించి తాజాగా సవరించిన విధంగా... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ హైకోర్టుతో సంప్రదించి.. మిస్టర్ అమన్ ప్రతాప్ సేవలను రద్దు చేశారు. ప్రస్తుతం ప్రొబేషన్ లో ఉన్న సింగ్.. ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ నుంచి తక్షణమే తొలగించబడతారని నోటిఫికేషన్ లో పేర్కొంది!
సెప్టెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు తన పరిపాలనా పరంగా న్యాయమూర్తి అమన్ ప్రతాప్ సింగ్ నుంచి న్యాయపరమైన పనిని ఉపసంహరించుకుంది. అనంతరం అతనిని అబ్జర్వేషన్ లో ఉంచింది. న్యాయమూర్తి క్రమశిక్షణా రాహిత్యం, కోర్టు సమయాలను పాటించకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబందిత వర్గాలు తెలిపాయి!
కాగా.. కోర్టు హాలులో న్యాయమూర్తి అమన్ ప్రతాప్ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్దిసేపటికె ఈ పరిణామం చోటు చేసుకుంది. వీడియోలో.. న్యాయమూర్తి తన కుర్చీలో నుంచి లేచి నిలబడి కోర్టు సిబ్బంది, నిందితుడి తరుపు న్యాయవాదిపై అరుస్తున్నట్లు కనిపించింది.