ఎప్పుడూ జరగనిది పూరీ ఆలయంలో జరిగింది.. జెండా పట్టుకెళ్లిన గద్ద
ఒక అనూహ్య పరిణామం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో చోటు చేసుకుంది. పూరీ అన్నంతనే గుర్తుకు వచ్చే పూరీ శ్రీక్షేత్రం ఆలయం మీద ఎగురవేసే పవిత్ర పతాకాన్ని ఒక గద్ద తీసుకెళ్లిన వైనం సంచలనంగా మారింది.;

ఒక అనూహ్య పరిణామం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో చోటు చేసుకుంది. పూరీ అన్నంతనే గుర్తుకు వచ్చే పూరీ శ్రీక్షేత్రం ఆలయం మీద ఎగురవేసే పవిత్ర పతాకాన్ని ఒక గద్ద తీసుకెళ్లిన వైనం సంచలనంగా మారింది. ఆలయ చరిత్రలో ఈ తరహా ఘటన ఇప్పటివరకు చోటు చేసుకోలేదని.. ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో షూట్ చేసి.. సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు.
ఇంతకూ ఈ జెండా ప్రత్యేకత ఏమంటే.. పూరీకి వచ్చే భక్తులంతా తొలుత ఈ జెండా (పతిత పావన జెండా)ను దర్శనం చేసుకుంటారు. చేతులెత్తి మొక్కిన తర్వాత మాత్రమే ఆలయంలోని జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఈ జెండాను ఆలయ శిఖరం మీద ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు దీన్ని మారుస్తూ ఉంటారు. ఇదేమీ చిన్నా చితకా జెండా కాదు. ఏకంగా 14 మూరలు ఉంటుంది.
ఆలయ శిఖరం మీద ఎగిరే ఈ జెండాకు దిగువన భక్తులు సమర్పించే మొక్కుబడుల జెండాను కడతారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఒక గద్ద వచ్చి.. జెండాను లాక్కెళ్లం సంచలనంగా మారింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం.. ఏం జరగటానికి ఇది సంకేతమన్న మాటను కొందరు పూజారుల నోట వినిపిస్తోంది.