ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం... కేటీఆర్ పై ఈడీ కేసు!

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదు చేసింది.

Update: 2024-12-21 05:51 GMT

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికె తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలోకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఎంట్రీ ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదు చేసింది.

అవును... ఫార్ములా ఈ రేసు వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తూ చేస్తున్న క్రమంలోనే.. ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఎన్ ఫోర్స్ మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో మాజీ మంత్రి, బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది.

ఇదే సమయంలో... అర్వింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డిలను నిందితులుగా చేరించి. దీనికి సంబంధించి సోమవారం తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటుననరు. వారి వారి వాంగ్మూలలను సేకరించిన తర్వాత తదుపరి కార్యచరణపై దృష్టి సారించనుందని తెలుస్తోంది.

సుమారు రూ.45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ (బ్రిటీష్ పౌండ్) రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఈడీ ఆరా తీయనుందని అంటున్నారు! ఇదే సమయంలో... ఈ వ్యవహారంలో ఫెమా, పీ.ఎం.ఎల్.ఎ. చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుందని అంటున్నారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి విదేశాలకు నగదు బదిలీ చేసేటప్పుడు ప్రభుత్వ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటారు! అయితే... గత ఏడాది అక్టోబర్ నెలలో లండన్ లోని ఎఫ్.ఈ.వో. ఖాతాకు నగదు బదిలీ చేసిన సందర్భంలో రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేకపోవడం గమనార్హం!

అంతకముందు... ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో తనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.అర్.ను క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలూ చేయగా.. దానిపై విచారణ జరిగింది. ఈ సమయంలో.. అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

మరోపక్క ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని, గవర్నర్ ఆమోదించిన తర్వాతే కేసు నమోదు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సమయంలో.. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఈ నెల 30 వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

ఇదే సమయంలో మరో పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్. ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.

Tags:    

Similar News