డీఎంకే ఎంపీకి "భారీ" షాక్... రూ.908 కోట్ల జరిమానా!

తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ సహా ఆయన కుటుంబానికి భారీ జరిమానా పడింది.

Update: 2024-08-29 03:38 GMT

తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ సహా ఆయన కుటుంబానికి భారీ జరిమానా పడింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. విదేశీ మరక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో జగత్రక్షకన్, అతని కుటుంబానికి కలిపి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇందులో రూ.89 కోట్ల విలువైన జప్తు ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.

అవును... తమిళనాడు ఎంపీ, వ్యాపారవేత్త జగత్రక్షకన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, అనుబంధిత భారతీయ సంస్థలపై ఫెమా కింద విచారణ జరిగింది చెన్నైలోని ఈడీ. ఈ సమయంలో... రు.89.19 కోట్ల విలువైన ఆస్తులను ఫెమా చట్టంలోని సెక్షన్ 37ఏ కింద స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక ఎక్స్ పోస్ట్ లో తెలిపింది.

ఇందులో భాగంగా... "ఫెమా సెక్షన్ 37ఏ ప్రకారం రూ.89.19 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడానికి ఆదేశించడమైంది. 26 ఆగస్ట్ 2024 నాటి అడ్జుడికేషన్ ఆర్డర్ ప్రకారం రూ.908 కోట్ల జరిమానా విధించబడింది!" అని ఈడీ తెలిపింది.

ఎవరీ ఎస్ జగత్రక్షనక్..?:

76 ఏళ్ల ఎస్ జగత్రక్షకన్.. డీఎంకే నుంచి అరక్కోణం లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చెన్నైకి చెందిన ఆకార్డ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అయిన జగత్రక్షకన్... హాస్పటలిటీ, ఫార్మాస్యూటికల్స్, లిక్కర్ తయారీ పరిశ్రమల్లోనూ ఆసక్తిని కలిగి ఉన్నారు. ఇదే సమయంలో... భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రూపంలో విద్యారంగంలోనూ ఉన్నారు.

ఈడీ కేసు ఏమిటి..?:

డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, అతని ఫ్యామిలీ మెంబర్స్, సంబంధిత కంపెనీలపై ఫెమాలోని సెక్షన్ 16 కింద కేంద్ర ఏజెన్సీ ఫిర్యాదును ఫెమా దాఖలు చేసిందని డిసెంబర్ 1 - 2021న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇందులో భాగంగా... వివిధ ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. ప్రధానంగా 2017లో సింగపూర్ లోని షెల్ కంపెనీలో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టారని.. శ్రీలంక సంస్థలో రూ.9 కోట్లు పెట్టుబడులు పెట్టారని పేర్కొంది!

Tags:    

Similar News