బాబు కేసులో ఈడీ రంగంలోకి.....?
అనేక కీలకమైన సెక్షన్లు ఈ కేసులో ఉండడంతో ఈ కేసులో ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే అంతటా ఉంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది.
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సంచలనం రాజకీయంగా రేపుతోంది. బాబుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయనను కోర్టులో హారు పరచి కస్టడీ కూడా కోరతారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఏపీ సీఐడీ రెండేళ్ల నుంచి దర్యాప్తు చేస్తోంది.
దాంతో అన్ని వైపుల నుంచి వచ్చిన సమాచారం మేరకు చంద్రబాబుని శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. నంద్యాల నుంచి బాబుని సాయంత్రానికి సిట్ ఆఫీసుకు తరలించారు. బాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అవినీతి వ్వయవహారంలో సూత్రధారి అని ఏపీ సీఐడి అదనపు డైరెక్టర్ సంజయ్ మీడియా మీటింగ్ పెట్టి మరీ చెప్పారు.
ఏపీలో 371 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అని కూడా ఆయన ఆరోపించారు. అనేక కీలకమైన సెక్షన్లు ఈ కేసులో ఉండడంతో ఈ కేసులో ఏమి జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే అంతటా ఉంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు జరిపిందని కూడా అంటున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికపుడు ఏపీ సీఐడీ ఈడీతో పంచుకుంటోందని అంటున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ వ్యవహారం కూడా ఉండడంతో ఈడీ కూడా మరింత దూకుడు చేయవచ్చు అంటున్నారు. ఈ కేసులో చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు న్యాయ నిపుణులు, మేధావులు. ఏపీ సీఐడీ పెట్టిన కొన్ని సెక్షన్లు తీసుకుంటే ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
చంద్రబాబును ముందుగా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కోర్టులో హాజరుపరుస్తారని ఆ తర్వాత అవినీతి చట్టం ప్రమేయం ఉన్నందున సీఐడీ కస్టడీ కోరవచ్చని అంటున్నారు. ఇక ఈ కేసు ఆర్థికపరమైన కారణాలతో చంద్రబాబు నేరుగా ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇక ఈకేసులో ఆర్థిక అంశాలకు సంబంధించినవి ఉన్నాయి, అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి విచారించాల్సి ఉంటుందని అంటున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేసుల్లో అన్ని అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించిసహేతుకమైన నిర్ణయాలను అందించిన తర్వాతే బెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది.
అంటే బెయిల్ విషయంలో కూడా ఈ కేసులో అనుకున్నంత సులువు కాదా అన్న చర్చ వస్తోంది. అదే టైం లో సీఐడీ వాదనలు గట్టిగా వినిపించినట్లు అయితే కస్టడీకి ఇచ్చే చాన్స్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈడీ రంగ ప్రవేశం చేస్తే కనుక ఈ కేసు కొత్త మలుపు తిరిగే అవకశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.