యుద్ధం ప్రకటించిన రేవంత్? విచారణకు ఆదేశం!

మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ రూ. 44,434 కోట్లు అని చెప్పారు.

Update: 2023-12-21 10:22 GMT

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక, విద్యుత్ రంగాలపై చర్చ సాగుతోంది. విద్యుత్ రంగంలో అప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని అధికార పార్టీ చెబుతుంటే ప్రతిపక్షం మాత్రం విద్యత్ సంస్థలో అప్పులు లేవు ఆస్తులే ఉన్నాయని బుకాయిస్తోంది. దీంతో విద్యత్ పై సభలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. దేశంలోనే 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే కావాలనే బుదర జల్లే ప్రయత్నం చేస్తున్నారని సభ్యులు చెబుతున్నారు.

మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 2014 జూన్ 2 నాటికి నాలుగు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ రూ. 44,434 కోట్లు అని చెప్పారు. అప్పులు రూ.22,423 కోట్లు ఉన్నాయి. ఆస్తుల విలువ రూ.1,37,570 కోట్లు కాగా అప్పుల విలువ రూ. 81,516 కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దానిపై వివరణ కొనసాగుతోంది.

విద్యుత్ రంగంలో ఇప్పటి వరకు ఉన్న రూ. 81,516కోట్లు అప్పు ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్కంలకు రూ.62,461 కోట్ల మేర నష్టాలు జరిగినట్లు చెబుతున్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో విద్యుత్ రంగం కోలుకోలేని విధంగా నష్టాల్లో మునిగిందని ఆరోపించారు.

విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిస్కంలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభలో వాడివేడి చర్చ సాగుతోంది. విద్యుత్ రంగంలో చేసిన అప్పులతో ప్రభుత్వంపై పెనుభారం పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

యాదాద్రి ప్రాజెక్టు విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించడంతో ఆయన సవాలును సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా చత్తీస్ గడ్ తో విద్యుత్ ఒప్పందం, యాదాద్రి ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించడం సంచలనం కలిగించింది. 24 గంటల విద్యుత్ పై నిజనిర్ధారణ కమిటీ వేస్తామని చెప్పారు. యాదాద్రి ప్రాజెక్టు ఎనిమిది ఏళ్లయినా ఇంకా పూర్తికాకపోవడంపై కూడా విచారణ కొనసాగిస్తామని తేల్చారు.

Tags:    

Similar News