2025 నాటికి దేశంలో గాల్లో ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీలు?

''వచ్చే సంవత్సరం మార్చి నాటికి మేము మొదటి ధృవీకరించదగిన నమూనాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాము.

Update: 2024-05-14 05:02 GMT

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. వచ్చే ఏడాది నాటికి భారతదేశం తన మొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని అందించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసారు. X ఖాతాలో ఒక పోస్ట్‌లో మహీంద్రా ఇలా రాసారు. ''ప్ర‌ముఖ విమానయాన‌ సంస్థ వచ్చే ఏడాదిలోగా ఎగిరే ఎలక్ట్రిక్ టాక్సీని తయారు చేసేందుకు మద్రాస్‌- ఐఐటీలో ఒక కంపెనీని ఇంక్యుబేట్ (ప‌రిశోధ‌న‌కు కేటాయించ‌డం) చేస్తోంది'' అని తెలిపారు.

IIT మద్రాస్ ప్రపంచంలోని అత్యంత ఎగ్జ‌యిట్ చేసే చురుకైన ఇంక్యుబేటర్లలో ఒకటి. వారికి ధన్యవాదాలు.. భారతదేశం అంతటా వేగంగా ప్రతిష్టాత్మక ఇంక్యుబేటర్ల సంఖ్య పెరుగుతోంది. ఇకపై నిజమైన ఆవిష్కర్తలు లేని దేశంగా మ‌న దేశాన్ని చూడలేం'' అని మ‌హీంద్రా ఆనందం వ్య‌క్తం చేసారు. ''ధైర్యమైన ఆకాంక్షలు ముఖ్యం... పరిమితులను అంగీకరించవద్దు'' అని కూడా ప్రోత్సాహ‌కంగా రాసారు.

చెన్నైకి చెందిన స్టార్టప్ అయిన ఇ-ప్లేన్ కంపెనీ వచ్చే ఏడాది మార్చి నాటికి పట్టణ రద్దీ సమస్యలను పరిష్కరించడానికి ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ టాక్సీ సర్టిఫైడ్ ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉందని ఏప్రిల్‌లో ముందుగా జాతీయ వార్తా సంస్థ తెలిపింది. మద్రాస్‌లోని ఐఐటీలో నెలకొల్పిన కంపెనీ సమీప భవిష్యత్తులో 2 నుంచి 6 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్‌లను వాణిజ్యీకరించడంపై దృష్టి సారిస్తోందని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఇ-ప్లేన్ కంపెనీ వ్యవస్థాపకుడు CEO సత్య చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఇది eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. మొదటగా మూడు లేదా నాలుగు-సీట్ల విమానంగా మార్చాం. దీనిని ఎయిర్ అంబులెన్స్‌గా మార్చవచ్చు... అని తెలిపారు.

''వచ్చే సంవత్సరం మార్చి నాటికి మేము మొదటి ధృవీకరించదగిన నమూనాను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాము. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నుండి సర్టిఫికేషన్ పొందడానికి మరో రెండేళ్లు పడుతుంది'' అని చక్రవర్తి పిటిఐకి చెప్పారు. స్టార్టప్ వెబ్‌సైట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. ఒక ఇ ప్లేన్ వ్యక్తిగత వాహనం ప్రయాణ సమయాన్ని 60 నిమిషాల నుండి 14 నిమిషాలకు తగ్గించేస్తుంది. eVTOLలను ఉపయోగించి పట్టణ ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం సంస్థ విస్తృత లక్ష్యం.. అని తెలిపింది.

Tags:    

Similar News