అమెరికా అంటే అలానే ఉంటాది.. మస్క్ కు షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు

ఇదిలా ఉండగా.. తాజాగా డోజ్ ఉద్యోగులు పలువురు ఒకే మాట మీదకు వచ్చారు. ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియలో తాము భాగస్వాములం కాలేమని తేల్చేశారు.

Update: 2025-02-26 04:58 GMT

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ప్రపంచంలోని దేశాల్లో అమెరికాకు.. ఆ దేశ పౌరులైన అమెరికన్ల లక్షణాలు కాస్త భిన్నంగా ఉంటాయి. చేతిలో ఉన్న అధికారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూస్తే.. అమెరికన్లు అస్సలు తట్టుకోలేరు. అంతేకాదు.. తమలోని వారిని ఎవరినో టార్గెట్ చేయటానికి తమను వాడేస్తామన్నా వారు ఊరుకోరు. ఒక స్థాయి వరకు ఓకే కానీ.. మితిమీరిన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే వారు ఎవరైనా సరే.. దిమ్మ తిరిగేలా షాకిస్తారు. అందుకే ఆ దేశాన్ని అమెరికా అంటూ అమెరికన్లు సగర్వంగా చెబుతుంటారు.

అక్కడ ఎవరికి అపరిమితమైన వ్యక్తిగత శక్తులు ఉండేందుకు అమెరికన్లు పెద్దగా ఇష్టపడరన్న మాట వినిపిస్తుంది. ఒకవేళ.. వారెంత శక్తివంతులైనా.. వ్యవస్థకు చేటు కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే నిర్మోహమాటంగా బయటకు వచ్చి మాట్లాడేయటమే కాదు.. సొంత పార్టీకి సైతం షాకులు ఇవ్వటం అక్కడ కనిపిస్తుంది. తాజాగా అలాంటి సీన్ ఒకటి అగ్రరాజ్యంలో చోటు చేసుకుంది.

రెండోసారి ట్రంప్ అధికారాన్ని చేపట్టిన తర్వాత కీలకమైన సివిల్ సర్వీస్ ఉద్యోగుల్ని తప్పించే పని పెట్టుకోవటం తెలిసిందే. ఇందుకోసం తన నేత్రత్వంలో డోజ్ పేరుతో ఒక వ్యవస్థను రన్ చేస్తున్నారు. మొత్తం సివిల్ ఉద్యోగుల్ని తన ఆదేశాలతో కంట్రోల్ చేయాలని మస్క్ తపిస్తున్నా.. ఆ దిశగా అడుగులు పడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఇప్పటికే మస్క్ కు ఇచ్చిన అదికారాలపై అమెరికన్లలో అగ్రహం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా డోజ్ ఉద్యోగులు పలువురు ఒకే మాట మీదకు వచ్చారు. ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియలో తాము భాగస్వాములం కాలేమని తేల్చేశారు. అంతేకాదు.. డోజ్ లో పని చేస్తున్న 21 మంది తమ పదవులకు రాజీనామా చేసేసి.. బయటకు వచ్చేసిన వైనం షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. తాము అమెరికన్ ప్రజలకు సేవ చేయటానికి ప్రతిజ్ఞ చేశామని.. అధ్యక్ష పాలనా వ్యవస్థల్లో రాజ్యాంగ విలువలను నిలబెడతామని ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ తమ రాజీనామాల్ని సమర్పించటం గమనార్హం.

తమకున్న సాంకేతిక నైపుణ్యాల్ని సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపునకు వినియోగించలేమన్న వారి వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ కు.. ట్రంప్ సర్కారుకు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్ లో రాజకీయ ఉద్దేశాలు ఉన్న వారే ఎక్కువగా ఉన్నట్లుగా రాజీనామా చేసిన వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వారికి లక్ష్య సాదనలో తగిన నైపుణ్యం కానీ.. అనుభవం కానీ లేవని వారు మండిపడుతున్నారు.

తాము పవర్ లోకి వచ్చినంతనే ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ లో ఎలాన్ మస్క్ అండ్ టీం.. పెద్ద ఎత్తున కాంటాక్టుల్ని రద్దు చేశారు. అలా రద్దు చేసిన కాంట్రాక్టుల కారణంగా ఖజానాకు ఆదా అయ్యే నిధులు ఏమీ లేవన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గత వారం నాటికి 1125 కాంట్రాక్టులను డోజ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటివేళలో.. ఈ తరహా పరిణామం చోటు చేసుకోవటం.. దీనికి ఎలాన్ మస్క్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Tags:    

Similar News