డోజ్ నుంచి బయటకు రావటమా.. మస్క్ తాజా మాటలు విన్నారా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాను నిర్వహిస్తున్న డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి తప్పుకోనున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.;

ట్రంప్ ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాను నిర్వహిస్తున్న డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి తప్పుకోనున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను డోజ్ నుంచి తప్పుకోవాలని అనుకోవట్లేదన్న ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను చేపట్టిన పని పూర్తయ్యే వరకు తాను డోజ్ సారథ్యాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పారు.
మస్క్ మాత్రమే కాదు వైట్ హౌస్ సైతం.. డోజ్ నుంచి వైదొలిగే అంశాన్ని ఖండించింది. తాను డోజ్ నుంచి తప్పుకుంటున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవన్నీ ఉత్త పుకార్లుగా తేల్చేశారు. మస్క్ చెప్పిన విషయాన్నే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ కూడా చెప్పారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల బాధ్యత నుంచి మస్క్ తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే.. అది వాళ్లనను మోసగించుకోవటమేనని వ్యాఖ్యానించారు.
అయితే.. ఇక్కడే మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి. డోజ్ నుంచి కొద్ది వారాల్లో మస్క్ తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్ కు తెలిపినట్లుగా పొలిటికో రిపోర్టు పేర్కొనటం గమనార్హం. మస్క్ తన వ్యాపారం మీద మరింత ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లుగా పేర్కొంటూ.. ఈ ప్రతిపాదనకు ట్రంప్ సైతం ఓకే చేసినట్లుగా పేర్కొన్నారు. అంతలోనే ఏమైందో కానీ.. డోజ్ సారథ్య బాధ్యతల్ని తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. డోజ్ సారథ్య బాధ్యతల పదవీ కాలం మే చివరకు పూర్తి కానుంది. అయితే.. ఇప్పుడున్న పరిణామాల్ని చూస్తే.. ఆటోమేటిక గా కొనసాగింపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.