'డోజ్' డ్యూటీ ఎక్కేసిన మస్క్... ఆ పోస్టుల్లో పేర్లున్న వారికి టెన్షన్ స్టార్ట్!
ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఇప్పటికే పనులు మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరుపున అన్నీ తానై అన్నట్లుగా కీలక భూమిక పోషించిన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్... ఎన్నికల ఫలితాల అనంతరం మరింత కీలకంగా మారుతోన్నారు. ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు స్వీకరించనున్న ఆయన ఇప్పటికే పనులు మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది.
అవును... ట్రంప్ నేతృత్వంలోని ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు స్వీకరించనున్న ఎలాన్ మస్క్.. ఇప్పటికే విధులు నిర్వర్తించడం ప్రారంభించారనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో.. ఆయన ఇటీవల పెట్టిన ఓ పోస్ట్ ఫెడరల్ ఉద్యోగుల్లో సరికొత్త టెన్షన్స్ రేపుతోందని అంటున్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్... ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి లను డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిసియెన్సీ (డోజ్) సంయుక్త సారథులుగా నియమించిన సంగతి తెలిసిందే. దుబారా ఖర్చులు తగ్గిస్తూ.. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ ప్రాజెక్ట్ రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ సమయంలో... తాజాగా జరిగిన ఓ పరిణామం చూస్తుంటే.. బాధ్యతలు స్వీకరించకముందే ఎలాన్ మస్క్ డ్యూటీ ఎక్కేశారనే కామెంట్లకు బలం చేకూరుస్తుంది. తాజగా పర్యావరణ సంబంధిత విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారి పేర్లు, వారి వివరాలతో ఉన్న పోస్టును షేర్ చేశారు మస్క్. ఫెంటాసిల్ హ్యాండిల్ లో తొలుత ఈ వివరాలు పోస్ట్ అయ్యాయి.
అంతకంటే ముందు ఫేక్ జాబ్స్ అంటూ వ్యాఖ్యలు చేసిన మస్క్... మూకుమ్మడి తొలగింపులకు పిలుపునిచ్చారు. దీంతో... సదరు సిబ్బంది నెగెటివ్ కామెంట్లు పెడుతూ ఫైరవుతున్నారు. ఉద్యోగులను భయపెట్టేందుకే మస్క్ ఈ తరహా వ్యూహాలను అమలు చేస్తున్నారని.. ఈ తరహా వ్యవహారాలు మస్క్ కు కొత్తేమీ కాదని చెబుతున్నారు.
కాగా... ఈ శాఖను సమర్ధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ వ్యవస్థలో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి మార్పులు తెస్తారని తాను ఆశిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ఏటా ప్రభుత్వం ఖర్చుపెడుతున్న 6.5 ట్రిలియన్ డాలర్లలో దుబారాను అరికడతామని అన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామన్నారు. ఫెడరల్ సంస్థలను పునర్మించి.. మస్క్, వివేక్ తన పాలనకు మార్గం సిద్ధం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే... బాధ్యతలు స్వీకరించక ముందే మస్క్ పనులు మొదలుపెట్టినట్లు ఈ వ్యవహారంతో తెలుస్తోందని అంటున్నారు నెటిజన్లు!