ప్రపంచవ్యాప్తంగా జనాభా క్షీణత... మస్క్ ఇంట్రస్టింగ్ రియాక్షన్!

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనా వంటి దేశాలతో పాటు పలు దేశాల్లో జనాభా క్షీణత ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే

Update: 2025-01-08 04:28 GMT

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనా వంటి దేశాలతో పాటు పలు దేశాల్లో జనాభా క్షీణత ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైనా, జపాన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో జననాల రేటు విపరీతంగా పడిపోతుందని అంటున్నారు. ఈ విషయంలో పిల్లలను కనాలంటూ పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి ప్రభుత్వాలు!

కొన్ని దేశాల్లో ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా తమ తమ సంస్థల్లోని ఉద్యోగులు పిల్లలను కంటే బహుమతులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... జనాభా పెంచాల్సిన అవసరాన్ని వెల్లడిస్తూ.. ఎక్కువ మంది పిల్లలను కన్న తల్లితండ్రులకు నగదు బహుమతులు ప్రకటించారు.

ఈ విధంగా ప్రపంచంలోని పలు దేశాల్లో జననాల రేటూ తగ్గుదలపై ఆయా ప్రభుత్వాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో యువత సంఖ్య దారుణంగా పడిపోగా.. వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విధంగా.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్షీణత ఆందోళన కలిగిస్తున్న వేళ మస్క్ స్పందించారు.

అవును... ప్రపంచవ్యాప్తంగా భారత్, చైనా వంటి దేశాలతో పాటు పలు దేశాల్లో జనాభా క్షీణతపై ఆయా ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఇది ఒకటని అభిప్రాయపడ్డారు.

టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ ఎక్స్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని జనాభా క్షీణత అంచనాకూ సంబంధించిన ఓ గ్రాఫ్ ను పంచుకుంది. అందులో... భారత్, చైనా సహా నైజీరియా, యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, పాకిస్థాన్, ఎథియోఫియా, కాంగో వంటి దేశాల్లో 2018 నుంచి 2100 మధ్య జనాభాలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయనేది అందులో పేర్కొంది.

ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికా జనాభాలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనా వంటి దేశాల్లో ఈ శతాబ్ధం (2100) నాటికి క్షీణత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో... ఈ గ్రాఫ్ ను పోస్టు చేస్తూ... "జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ముప్పు.. ఎలాన్ మస్క్" అని పోస్ట్ చేసింది.

దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్... "అవును" అని రాసి టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట హల్ చల్ చేస్తోంది!

Tags:    

Similar News