తాజా 'లెక్క' ఇదిగో... మస్క్ కు శుక్ర మహర్ధశ ప్రారంభమైందా?

ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం... మస్క్ కు చెందిన టెస్లా స్టాక్ మంగళవారం 28 శాతం పెరగగా

Update: 2024-11-09 17:30 GMT

ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో గెలిచి ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం సంగతేమో కానీ... ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి గెలుపుతో మస్క్ కి మాత్రం శుక్ర మహర్ధశ ప్రారంభమైందనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. తాజాగా... మస్క్ సంపద మూడేళ్ల తర్వాత రికార్డ్ స్థాయి మార్కును చేరుకోంది. మిగిలిన కుబేరులకు ఇప్పట్లో అందనంత ఎత్తులో అన్నట్లుగా మస్క్ పరిస్థితి ఉందని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్న్నికల్లో ట్రంప్ గెలుపు కన్ ఫాం అయిన సమయంలోనే ట్రంప్ సంపద భారీగా పెరిగింది. ఇందులో భాగంగా... 26.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2 లక్షల కోట్లు) మేర పెరిగింది! ఈ క్రమలో మస్క్ సంపద భారీగా పెరిగిందని.. పెరుగుతూనే ఉందని ఆ లెక్క 300 బిలియన్ డాలర్లు (రూ. 25 లక్షల కోట్లు) దాటేసిందని తాజా నివేదిక వెల్లడించింది.

ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపిన వివరాల ప్రకారం... మస్క్ కు చెందిన టెస్లా స్టాక్ మంగళవారం 28 శాతం పెరగగా.. ప్రస్తుతం ఆయన సంపద మొతతం 50 బిలియన్లు పెరిగి 314 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి 2022 జనవరిలో $ 340 బిలియన్లతో మస్క్... 300 బిలియన్ డాలర్స్ పైగా సంపద కలిగిన ఏకైన వ్యక్తిగా నిలిచారు.

కాగా... అమెరికా అధ్యక్ష ఎనికల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ట్రంప్ కోసం అవిరామంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన మస్క్... ఆర్థికంగా కూడా చాలా మద్దతుగా నిలిచారని అంటున్నారు! గెలుపు అనంతరం ట్రంప్ కూడా మస్క్ ను ఆకాశానికి ఎత్తేశారు. దీంతో.. మస్క్ సంపద భారీగా పెరుగుతుందని అంటున్నారు!

బ్లూమ్ బర్గ్ బిలియనీర్ తాజా జాబితా!:

1. ఎలాన్ మస్క్ - 314 బిలియన్ డాలర్లు

2. జెఫ్ బెజోస్ - 230 బిలియన్ డాలర్లు

3. మార్క్ జుకర్ బర్గ్ - 209 బిలియన్ డాలర్లు

4. లారీ ఎల్లిసన్ - 202 బిలియన్ డాలర్లు

5. బెర్నర్డ్ ఆర్నాల్డ్ - 172 బిలియన్ డాలర్లు

6. బిల్ గేట్స్ - 162 బిలియన్ డాలర్లు

7. లారీ పేజీ - 160 బిలియన్ డాలర్లు

8. సెర్గీ బ్రీన్ - 151 బిలియన్ డాలర్లు

9. స్టీవ్ బాల్మెర్ - 147 బిలియన్ డాలర్లు

10. వారెన్ బఫెట్ - 146 బిలియన్ డాలర్లు

ఈ జాబితాలో 97.1 బిలియన్ డాలర్లతో ముకేష్ అంబానీ 17వ స్థానంలో ఉండగా... 92.3 బిలియన్ డాలర్లతో గౌతం అదానీ 18వ స్థానంలో ఉన్నారు. ఇదే సమయంలో... 42.1 బిలియన్ డాలర్లతో శివ నాడార్ 36వ స్థానంలో ఉన్నారు.

Tags:    

Similar News