లాగిన్ కాకుండా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఓపెన్ కోసం సత్యకు మస్క్ రిక్వెస్టు

ఈ నేపథ్యంలో మస్క్.. సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పెట్టి.. తన ఇష్యూను ఆయన ముందుకు తీసుకెళ్లారు.

Update: 2024-02-28 05:05 GMT

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆయన ఇటీవల ఒక కొత్త ల్యాప్ టాప్ (విండోస్)ను కొనుగోలు చేశారు. అయితే.. మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లాగిన్ కావాల్సిన వస్తోంది. అయితే.. మస్క్ కు అకౌంట్ క్రియేట్ చేయటం ఇష్టం లేదు. దీంతో.. తనకు ఎదురైన సమస్య గురించి సోషల్ మీడియా ద్వారా సత్య నాదెళ్లకు స్పెషల్ రిక్వెస్టు పెట్టారు. అయితే.. దీనిపై సత్య నాదెళ్ల కానీ.. మైక్రోసాఫ్ట్ కానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మస్క్.. సత్య నాదెళ్లకు నేరుగా మెసేజ్ పెట్టి.. తన ఇష్యూను ఆయన ముందుకు తీసుకెళ్లారు.అయితే.. సత్య నాదెళ్ల ఈ అంశంపై ఇప్పటివరకు స్పందించకపోవటం గమనార్హం.

తన కొత్త విండోస్ ల్యాప్ టాప్ ను ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ను లాగిన్ చేయాల్సి వస్తోందని.. అలాంటి అవసరం లేకుండా తనకు యాక్సిక్ కావాలని ఎలాన్ మస్క్ కోరారు. ‘సత్యా.. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా అనాలనుకోవటం లేదు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోకుండానే విండోస్ ను వాడుకునేలా అనుమతిని ఇవ్వగలరు. ఒకవేళ కంప్యూటర్ వైఫైకి కనక్ట్ అయితే..అప్షన్ కనిపించకుండా పోతోంది. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా.. వర్కు ఈమొయిల్ అడ్రస్ వాడుకోలేం. నాకు కేవలం వర్క్ ఈమొయిల్స్ మాత్రమే ఉన్నాయి’ అని మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సత్యనాదెళ్లకు మెసేజ్ చేశారు.

అయితే.. ఎలాన్ మస్క్ మెసేజ్ కు సత్య నాదెళ్ల ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఐఏకి తన కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వాలనుకోవటం లేదన్న మస్క్.. మైక్రోసాఫ్ట్ తీరు గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండా సిస్టమ్ వినియోగించుకునే వీలుండేలా ఆప్షన్ పెట్టాలని ఆయన కోరుతున్నారు. మరీ అంశం ఎప్పటికి తెగుతుందో చూడాలి.

Tags:    

Similar News