మెడికల్ సర్టిఫికెట్ ఫోర్జరీ.. అడ్డంగా బుక్ అయిన ఎంప్లాయ్..
ఇదే రకంగా ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ తన హైటెక్నాలజీ బుర్ర ఉపయోగించి చేసిన పని కారణంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంది.
టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ కొందరు అసాంఘిక చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇదే రకంగా ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ తన హైటెక్నాలజీ బుర్ర ఉపయోగించి చేసిన పని కారణంగా ఇబ్బందుల్లో ఇరుక్కుంది. ఏకంగా ఆమె తన మెడికల్ సర్టిఫికెట్ నే ఫోర్జరీ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో.. ఏం చేశారో తెలుసుకుందాం పదండి..
సింగపూర్ లో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్న 37 సంవత్సరాల వయసు కలిగిన సుక్విన్ ఇటీవల ఆఫీస్ కి వెళ్లకుండా ఉండడం కోసం తన మెడికల్ సర్టిఫికెట్ ని ఫోర్జరీ చేసింది. ఎంతో ధైర్యంగా ఈ సర్టిఫికెట్ ని ఆఫీస్ లో కూడా సబ్మిట్ చేసింది. అయితే ఇక్కడే ఆమె అనుకోకుండా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తనకు వచ్చిన ఫోటోషాప్ నైపుణ్యాన్ని ఉపయోగించి మెడికల్ సర్టిఫికెట్ ని ఫోర్జరీ చేసినందుకు ఆఫీస్ వారి ముందు అడ్డంగా బుక్ అయిపోయింది.
ఆమె చేసిన మోసంని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కంపెనీ ఆమె పై కోర్టులో కేసు కూడా వేశారు. ఈ విషయంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 5000 డాలర్ల భారీ జరిమానాన్ని విధించింది. అయితే తన తల్లి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మనస్థాపన చెందినందున అవసరమై ఇలా చేసినట్టు ఆమె అనంతరం స్పష్టం చేసింది. కానీ చివరికి ఆమె భారీ జరిమానాన్ని చెల్లించాల్సి వచ్చింది.
చాలామందికి ఇది పెద్ద విషయం అనిపించకపోవచ్చు ఎందుకంటే మన చుట్టుపక్కల ఇటువంటి నకిలీ సర్టిఫికెట్లు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మనలో చాలామంది అవసరం లేకపోయినా ఏదో ఒక కుట్టి సాగు చెప్పి సెలవులు తీసుకుంటూనే ఉంటారు. సెలవల కోసం అవసరమైతే నకిలీ మెడికల్ సర్టిఫికెట్ ని కూడా అందిస్తారు. టెక్కిలకు ఇది పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రస్తుతం ఇది విరివిగా కొనసాగుతోంది. ఎటువంటి వారికి సుక్విన్ సంఘటన ఓ భారీ రిమైండర్ గా మిగిలిపోతుంది. అవసరమైతే తప్ప అనవసరంగా అది కూడా కంపెనీకి అబద్ధాలు చెప్పి ఎప్పుడూ సెలవులు పెట్టకూడదు అనడానికి ఈమె సంఘటన ఓ ఉదాహరణ.