ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ తో వెల్ కం చెబుతున్న 2024!
అవును... ఇటీవల కాలంలో ఉద్యోగాలు పోవడం అనేది సర్వసాదారణమైపోయిన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఎన్నో ఒడిదుడుకుల మధ్య 2023 ముగియబోతుంది.. రాబోయే ఏడాది అయినా చాలా బాగుంటుంది అని అనుకుంటున్న కొంతమందిలో కొంతమందికి బ్యాడ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. పైగా అవి ఉద్యోగులకు సంబంధించి కావడం ఇది మరింత బ్యాడ్ న్యూస్ గా పరిణమించబోతుందని అంటున్నారు. దీంతో నూతన సంవత్సరం రాకముందే ఒక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చిందనే చర్చ మొదలైంది.
అవును... ఇటీవల కాలంలో ఉద్యోగాలు పోవడం అనేది సర్వసాదారణమైపోయిన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత రెండేళ్లలో సుమారు 35,000 మందికి పైగా భారతీయ స్టార్టప్ లలో ఉద్యోగాలు కోల్పోగా... రాబోయే ఏడాది 2024లో ప్రవేశించే నాటికి ఉద్యోగాల కోతలు మ్రింతగా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.
వాస్తవానికి 2022లో ప్రధానంగా బైజూస్, అన్ అకాడమి, ఓలా, బ్లింక్ ఇట్, స్కిల్ లింk, వైట్ హ్యాట్, షేర్ చాట్, జస్ట్ మనీ వంటి మొదలైన కంపెనీల నేతృత్వంలోని భారతీయ స్టార్టప్ లు సుమారు 18,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను వర్టికల్స్ నుండి తొలగించాయి. ఇదే సమయంలో ఐఎన్సీ42 నివేదిక ప్రకారం 2023లో వీటి సంఖ్య 17,000గా ఉంది.
ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఇందులో భాగంగా గేం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం లోకో ఇప్పటికే సుమారు 36శాతం మంది ఉద్యోగులను.. సోషల్ మీడియా ప్లాట్ ఫాం సుమారు 15శాతం మందిని తొలగించింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఈ కార్యక్రమం కొనసాగవచ్చని.. 2024లో ఇండియన్ స్టార్టప్ లలో మరికొన్ని ఉద్యోగాలు పోవచ్చని అంటున్నారు.