ఇలాంటి కెలుకుడు అవసరమా? సుప్రీం ఎదుట ఎంగేజ్ మెంట్?

అనన్యకు ఉంగరాన్ని ఉత్కర్ష్ సక్సేనా మోకాలిపై నిలబడి పూర్తి చేశారు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

Update: 2023-10-19 04:35 GMT

తెలిసినంతనే.. మరీ ఇంతలా కెలకాలా? అన్న భావన కలిగే చేసిన గే జంట తీరు ఇప్పుడు వార్తాంశంగా మారింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం నో చెప్పిన వేళ.. అందుకు భిన్నంగా సుప్రీంకోర్టు భవనం ఎదుటే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వైనం వైరల్ గా మారింది. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు.. సమాన హక్కులు ఇచ్చేందుకు సుప్రీం నో చెప్పటం తెలిసిందే.

ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పార్లమెంట్ దేనని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండొచ్చని.. అలాంటి జంటలపై ఎలాంటి వివక్షా ప్రదర్శించొద్దన్న సుప్రీంకోర్టు.. వారి హక్కుల్ని కాపాడాల్సిన అవసరం ఉందని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. సుప్రీం నుంచి సంచలన తీర్పును ఆశించిన వారంతా తాజాగా వచ్చిన తీర్పుతో నిరాశకు గురయ్యారు.

అయితే.. తమ పోరాటం ఆగదని.. మళ్లీ పోరాటం చేస్తామని స్వలింగ సంపర్కులు చెబుతున్నారు. ఇలాంటి వేళ.. అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చేస్తున్న అనన్య కోటియా.. అతని భాగస్వామి అయిన లాయర్ ఉత్కర్ష్ సక్సేనా సుప్రీంకోర్టు భవనం ఎదుట ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.

సుప్రీంకోర్టు భవనం కనిపించే దూరంలో ఉండి.. వారు తమ ఎంగేజ్ మెంట్ ను పూర్తి చేసుకున్నారు. అనన్యకు ఉంగరాన్ని ఉత్కర్ష్ సక్సేనా మోకాలిపై నిలబడి పూర్తి చేశారు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.

న్యాయపరంగా తాము అనుకున్న రీతిలో తీర్పు వచ్చినప్పటికి.. భవిష్యత్తులో సమాన హక్కులు.. గుర్తింపు కోసం తాము పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అందుకే తాము సుప్రీంభవనం ఎదుట ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లుగా వారు పేర్కొన్నారు.

స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించటం.. పది రోజుల పాటు చేపట్టిన విచారణలో 11 పేజీ తుది తీర్పును ఇవ్వటం తెలిసిందే. స్వలింగ సంపర్కులు పిల్లల్ని దత్తత తీసుకురావటంతో సహా కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి రాని వేళ.. 3-2 నిష్ఫత్తితో మెజార్టీ తీర్పును వెలువరించారు.

సీజేఐ చంద్రచూడ్.. జస్టిస్ కౌల్ స్వలింగ సంపర్క జంటలు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చని పేర్కొనగా.. జస్టిస్ కే రవింద్ర భట్.. జస్టిస్ పీఎస్ నరసింహచ.. జస్టిస్ హిమా కోహ్లి మాత్రం విభేదించారు.ఇదిలా ఉండగా.. సుప్రీంభవనం ఎదుట ఎంగేజ్ మెంట్ చేసుకున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News