అమెరికాలో సె*క్స్ కుంభకోణం... కీలక జాబితాలో ట్రంప్ మాజీ భార్య పేరు!
ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన ఈ దారుణాలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ పెట్టుబడిదారుడు జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన ఈ దారుణాలు తీవ్ర సంచలనం సృష్టించాయి. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా, వర్జిన్ ఐలాండ్స్, న్యూయార్క్, మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడనేది అతనిపై ప్రధాన ఆరోపణ.
ఈ సమయంలో... తన అఘాయిత్యాలకు బలైన బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని తన వద్దకు తీసుకొస్తే ఇంకొంత కమిషన్ ఇస్తానని ఆశ చూపేవాడట ఎప్ స్టీన్! ఇలా చైన్ సిస్టమ్ తరహాలో ఇతడి దారుణాలు జరిగేవని అప్పట్లో బయటపడింది. ఈ క్రమంలో సుమారు రెండు దశాబ్ధాల పాటు ఈ చీకటి వ్యవహారం జరగ్గా.. ఇది కాస్తా పాపం పండి 2005లో బట్టబయలైంది.
దీంతో.. అతడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఈ క్రమంలో... 2019 ఆగస్టులో ఎప్ స్టీన్ జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే.. అతడిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. ఈ సెక్స్ కుంభకోణం అమెరికాను కుదిపేసింది. ఈ సమయంలో తాజాగా మరోసారి ఈ వ్యవహారాన్ని ట్రంప్ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఈ సమయంలో కీలక పత్రాలను విడుదల చేసింది.
ఇందులో భాగంగా... జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన దారుణానికి సంబంధించి కీలక పత్రాలను అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసింది. దీనికి "ది ఎప్ స్టీన్ ఫైల్స్:ఫేజ్ 1" అని పేరు పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే పలు విడతలుగా ఈ కుంభకోణంలోని ఫైల్స్ బహిర్గతం అవ్వగా.. తాజాగా వెల్లడైన వాటిలో సరికొత్త అంశాలున్నాయని అంటున్నారు.
అవును... తాజాగా అగ్రరాజ్యం జస్టిస్ డిపార్ట్ మెంట్ జెఫ్రీ ఎప్ స్టీన్ పాల్పడిన దారుణాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ ను విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే విడుదలైన వాటితో పాటు కొన్ని కొత్త అంశాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు. ఈ సమయంలో.. అతని కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్ సమాచారం కీలకంగా ఉన్నాయని అంటున్నారు.
ఈ జాబితాలో... అమెరికా ఆరోగ్యశాఖ మంత్రి ఆర్.ఎఫ్. కెన్నడీ జూనియర్ తల్లి ఎథెల్ కెన్నడీ, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, సూపర్ మోడల్ నవోమీ క్యాంప్ బెల్, ఇంగ్లిష్ రాక్ బ్యాండ్ రోలింగ్ స్టోన్ మెంబర్ మైక్ జాగర్, యాక్టర్ అలెక్ బాల్డ్ విన్, ప్రముఖ పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ పేర్లు ఉన్నాయని అంటున్నారు.
ఇదే సమయంలో... డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య ఇవాన ట్రంప్, కుమార్తె ఇవాంక ట్రంప్, కెన్నడీ కుటుంబానికి చెందిన కెర్రీ, టెడ్ పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే.. వీరంతా ఎప్ స్టీన్ కస్టమర్లు కాదని.. అతని కాంటాక్ట్ లిస్ట్ లోని పేర్ల జాబితాలో ఈ పేర్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఎప్ స్టీన్ ప్రైవేట్ జెట్ కు సంబంధించిన ఫ్లైట్ లాగ్ జాబితానూ బహిర్గతం చేశారు!