బిగ్ బ్రేకింగ్ వీడియో... రియల్ ఎస్టేట్ బ్రోకర్ ని కొట్టిన ఈటల!

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ దళారిపై చేయి చేసుకున్నారు.

Update: 2025-01-21 07:55 GMT

మంచి మనిషిని ఒక మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. ఆ విధానం ఫాలో అయ్యారో.. లేక, పేదల భూములు ఆక్రమించుకున్నారని, ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం కట్టలు తెంచుకుందో తెలియదు కానీ... తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేయి చేసుకున్నారు.

అవును... బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ దళారిపై చేయి చేసుకున్నారు. తన అనుచరులతో పాటు ఘటనా స్థలానికి వెళ్లిన అయన.. సదరు దళారి చెంపపై ఒక్కటిచ్చారు! అనంతరం ఈటల అనుచరులు అతడిపై తలో దెబ్బా వేసినట్లు వీడియోలో ఒకనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మున్సిపాలిటీలోని ఏకశిలానగర్ లో ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం పర్యటించారు. ఈ సమయంలో బాధితులు ఎంపీ వద్ద మొర్రపెట్టుకున్నారు. తమ స్థలాలు కబ్జాకు గురయ్యాయని.. తమను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేశారు!

బాధితుల ఫిర్యాదుతో సదరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వద్దకు ఆగ్రహంగా వెళ్లిన ఈటల రాజేందర్.. ఆయనపై చేయి చేసుకున్నారు. ఇంటి స్థలాల యజమానులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావంటూ మండిపడ్డారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

Tags:    

Similar News