అక్కడ చావు కూడా ఖరిదే !

దీంతో అనాధ శవాల సంఖ్య పెరిగిపోతుంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 34 వేల డాలర్లు ఖర్చవుతుంది.

Update: 2024-05-20 17:30 GMT

అక్కడ బతకడం కన్నా చావే ఎక్కువ ఖరీదు అవుతుంది. అందుకే ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే వణికిపోతున్నారు. దీంతో అనాధ శవాల సంఖ్య పెరిగిపోతుంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 34 వేల డాలర్లు ఖర్చవుతుంది.

అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ. 27 లక్షలు. ఇది ఒక్క అంత్యక్రియల నిర్వహణ ఖర్చు మాత్రమే. వాహన రవాణా ఖర్చులు కూడా కలుపుకొంటే రూ.30 లక్షలు దాటుతుంది. ఈ ఖర్చును భరించలేని కుటుంబాలు తమవారి మృతదేహాలను అనాథల్లా వదిలేస్తున్నాయి.

దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి గత ఏడాది 2023లో ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అది తమవారిదేనని కుటుంబ సభ్యులు గుర్తించినా అంత్యక్రియల ఖర్చుకు భయపడి అక్కడే వదిలేస్తున్నారు.

Tags:    

Similar News