ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా? అయితే కొత్త సమస్యను తెచ్చుకున్నట్టే
మారుతున్న లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరికీ గంటల తరబడి కూర్చుని పనిచేయడం ఇప్పుడు చాలా కామనైపోయింది.;
మారుతున్న లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరికీ గంటల తరబడి కూర్చుని పనిచేయడం ఇప్పుడు చాలా కామనైపోయింది. ఆఫీస్ లో అయినా, ఇంట్లో అయినా కనీసం 6 నుంచి 8 గంటలు కూర్చుని పనిచేయాల్సి వస్తుంది. ఇలా ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరానికి ఎంతో ప్రమాదమని చెప్తున్నాయి ఆరోగ్య పరిశోధనలు.
రోజుకి 6 గంటలకు పైగా కూర్చుని పని చేసే వ్యక్తులకు ఊబకాయంతో పాటూ నాడీ వ్యవస్థదెబ్బ దెబ్బతిని వెన్ను నొప్పి ఎక్కువవుతుందని గతంలో ఎన్నో ఆరోగ్య పరిశోధనలు, అధ్యయనాలు తెలిపాయి. ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేయడం వల్ల ఇప్పుడు మరో సమస్య కూడా వాటిల్లే అవకాశమున్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో తేలింది.
అదే ఫ్యాటీ లివర్ సమస్య. రోజులో ఎక్కువ సేపు కూర్చునే ఉండటం వల్ల శరీరం పెద్దగా శ్రమ పడదు. దీంతో ఫ్యాటీలివర్ సమస్య బారిన పడే అవకాశముంటుందని పరిశోధనలో తేలింది. ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా కూర్చునే వర్క్ చేస్తుండటంతో వారిలో ఎక్కువమంది ఈ సమస్యతో బాధ పడుతున్నట్టు హెచ్‌సీయూ తెలిపింది.
దీన్ని నివారించుకోవడానికి ప్రతి అరగంటకు ఓసారి బ్రేక్ తీసుకుంటూ కనీసం రెండు మూడు నిమిషాలు నడవడం లాంటివి చేస్తే మంచిది. వర్క్ ప్లేస్ లో లిఫ్ట్ కు బదులు మెట్లను ఎంచుకోవడం, ఆఫీసులో, ఇంట్లో కావాలని కొన్ని పనులను నడుస్తూ చేసుకోవడం లాంటివి చేయాలి. వీటితో పాటూ ప్రతీరోజూ కనీసం 30 నిమిషాల పాటూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది.