అమెరికా ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఇవే కీలక అంశాలు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక అభ్యర్థి కమల హారి మధ్య హోరా హోరీ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-06 04:04 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక అభ్యర్థి కమల హారి మధ్య హోరా హోరీ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో వీరి మధ్య గెలుపోటముల్లో తేడా అతిస్వల్పంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే వెలువడిన తొలిఫలితం టైం గా మారిన పరిస్థితి. ఈ సమయంలో ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి.

అవును... ప్రపంచ వ్యాప్తంగా అత్యంత హాట్ టాపిక్ గా మారిన అమెరిక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ – హారిస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ సమయంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఈ సందర్భంగా.. అమెరికన్స్ ప్రధానంగా మూడు అంశాలను ఈ ఎన్నికల్లో అత్యతం కీలకంగా భావించారని అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్...!

ఎడిసన్ రీసెర్చ్ నుండి జాతీయ ఎగ్జిట్ పోల్స్ డేటా ప్రకారం... దాదాపు మూడొంతుల మంది అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని నమ్ముతున్నారు. ఇందులో భాగంగా... ఈ పోల్ లో 73 శాతం మంది అమెరికా ఓటర్లు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని విశ్వసించగా.. కేవలం 25 శాతం మంది మాత్రమే అది సురక్షితంగా ఉందని భావిస్తున్నారు.

తాజాగా సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... ప్రజాస్వామ్య స్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటివి ఈసారి ఎన్నికల్లో కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రతీ 10 మందిలో ఆరుగురు.. వీటిలో ప్రజాస్వామ్య స్థితిని మొదటి అంశంగా పేర్కొనగా.. ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ లను తదుపరి ప్రాధాన్యాలుగా పరిగణించారు!

ఇదే సమయంలో... సీ.ఎన్.ఎన్. విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... మూడోంతుల మంది ప్రస్తుతం అమెరికాలో జరుగుతున పరిణామాలపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉండగా.. నాలుగింట ఒక వంతు మాత్రమే ప్రస్తుత దేశ పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నారు. 10 మందిలో నలుగురు మాత్రమే బైడెన్ పనితీరును ఆమోదించారు.

అదేవిధంగా... ఎన్.బీ.సీ. న్యూస్ ప్రకారం... ప్రజాస్వామ్య స్థితిని ప్రధాన సమస్యగా 35 శాతం మంది భావించగా.. 31 శాతం మంది ఆర్థిక వవస్థను, 14 శాతం మంది అబార్షన్లను, 11 శాతం మంది వలసలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ అంశాలే ఇప్పుడు యూఎస్ ఎన్నికల్లో అత్యంత కీలక అంశాలుగా ఉన్నాయి.

వీటిలో ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్లను ముఖ్యమైన అంశాలుగా కమలా హారిస్ సపోర్టర్స్ కు నిలవగా.. ట్రంప్ మద్దతుదారులు ఆర్థిక వ్యవస్థ, వలసలు, ప్రజాస్వామ్యాన్ని కీలక అంశాలుగా పరిగణించారు.

Tags:    

Similar News