రివేంజ్ స్టోరీ... ఆవుకోసం పులిని చంపిన రైతు!

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు రెండు పులుల మృతదేహాలు కనిపించాయి.

Update: 2023-09-12 06:17 GMT

ఇదొక రివేంజ్ స్టోరీ.. తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.. తన ఆవు కోసం పులిని చంపేశాడు ఒక రైతు.. మృతిచెందిన పులుల కలేబారాలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు అసలు విషయం తెలుసుకుని షాకయ్యారట. అసలు ఏమిటీ ఆవు - పులి - రైతు కథ అనేది ఇప్పుడు చూద్దాం!

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు రెండు పులుల మృతదేహాలు కనిపించాయి. అయితే వాటిలో ఒకదానిపై గాయాలు ఉండగా.. మరోదానిపై మాత్రం ఎటువంటి గాయాలు లేవు. నీటి కుంటలో కనిపించిన ఈ రెండు పులుల వయసు మూడు, ఎనిమిదేళ్లు అని అధికారులు చెబుతున్నారు.

దీంతో వీటి మృతికి కారణం ఏమిటా అనే పరిశోధనలో ఉన్న ఫారెస్ట్ అధికారులకు... ఈ పులులు మృతి చెందిన కాస్త దూరంలో ఒక ఆవు కళేబారం కనిపించింది. దీంతో ఈ పులులతో పాటు, ఆ ఆవు కళేబారాల నుంచి నమూనాలను సేకరించిన అధికారులు... ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించారు.

అయితే ఆ టెస్టులో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆవూ కళేబారం మొత్తం విషయంతో నిండి ఉందని, ఆ విషపూరితమైన ఆవు కళేబరాన్ని తినడంతో పులులు చనిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఒక శాఖాహారీ అయిన ఆవు, మరో మాంసాహారి అయిన పులులు ఒకే విషం వల్ల ఏలా చనిపోయి ఉంటాయనే ఆలోచనకు వచ్చారట అధికారులు!

దీంతో ఆ ఆవు యజమానికి అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. అనంతరం తమదైన శైలిలో విచారించేసరికి అసలు విషయం బయట పెట్టాడంట.

ఆ ఆవు యజమాని వివరణ ప్రకారం... 10 రోజుల క్రితం తన ఆవు తప్పిపోయిందంట. దాన్ని వెతుకుతున్న క్రమంలో కాస్త దూరంలో ఆ ఆవు మృతిచెంది కనిపించిందట. దీంతో... తన ఆవుని పులే చంపి ఉంటుందని బలంగా భావించిన ఆ రైతులు... పులిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సయ్యాడంట. ఇందులో భాగంగానే ఆ ఆవు కళేబారానికి విషం పూశాడట.

దీంతో ఆ ఆవు కళేబరాన్ని తినడం వల్లే ఈ రెండు పులులలో ఒకటి మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చనిపోయినవాటిలో ఒక పులి శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించకపోగా.. మరొకటి గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీంతో చిన్న పులిని పెద్ద పులి గాయపరిచి చంపేసి ఉంటుంది. పెద్ద పులేమో ఆవు కళేబారాన్ని తిని చనిపోయిం ఉంటుందని భావిస్తున్నారంట అధికారులు.

అయితే ఈ విషయంలో పూర్తి వివరాల కోసం ఫోరెన్సిక్ నిపుణులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క ఈ రైతుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారగా... రైతు రివేంజ్ స్టోరీ మాత్రం వైరల్ అవుతుంది.

Tags:    

Similar News