అంతరిక్షంలో తొలి ప్రైవేటు అడుగు.. స్పేస్ వాక్ తో మస్క్ రికార్డు
'స్పేస్ ఎక్స్'.. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ అనే సంగతి తెలిసిందే.
మనం కలలో కూడా ఊహించనివి.. అతడు సాధ్యం చేసి చూపిస్తాడు.. మనం ‘కల్కి’ సినిమాలో చూసినవి కళ్ల ముందు కనిపించేలా చేస్తాడు.. ఆ బుర్ర పాదరసం కంటే మహా చురుకు.. ఇక అతడి ఆలోచనలు మరింత వేగం.. ఓ 20 ఏళ్లు ముందుకు ఆలోచిస్తారా? అన్నట్లుగా ఉంటాయి అవి. అద్భుతమైన ఫీచర్లతో టెస్లా వంటి సూపర్ కార్ ను తీసుకొచ్చినా.. స్పేస్ ఎక్స్ వంటి అంతరిక్ష ప్రయాణానికి కంపెనీని స్థాపించినా.. రూ.4 లక్షలు పెట్టి ట్విటర్ ను కొనుగోలు చేసినా.. ఏదైనా సంచలనమే. వీటి సరసన మరో ప్రత్యేకత సాధించారు.
స్పేస్ ఎక్స్.. సూర్
‘స్పేస్ ఎక్స్’.. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ను నిర్వహించింది. ఈ మేరకు చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు జరిగినవన్నీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన స్పేస్ వాక్ కే. మస్క సంస్థ చేపట్టింది మాత్రం అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్.
ఆ ప్రాజెక్టు పేరు పొలారిస్ డాన్..
తొలిసారి ప్రైవేటు స్పేస్ వాక్ చేపట్టిన ప్రాజెక్టు పేరు ‘పొలారిస్ డాన్’. ఇక్కడ డాన్ అంటే ఇంగ్లిష్ లో సూర్యోదయం అని. దీనిని Dawnగా చదువుకోవాలి. ఈ ప్రాజెక్టు కింద ఫాల్కన్-9 రాకెట్ ద్వారా మంగళవారం నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది స్పేస్ ఎక్స్. ఈ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ ప్రస్తుతం భూమి చుట్టూ చక్కర్లు కొడుతోంది.
అడుగేసింది వీరే..
పోలారిస్ డాన్ కింద వెళ్లిన స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ నుంచి జేర్డ్ ఇస్సాక్ మన్, సారా గిల్లి ఒకరితర్వాత ఒకరు బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశఆరు. స్పేక్ ఎక్స్ రూపొందించిన స్పేస్ సూట్ ను పరీక్షించారు. కాగా, వ్యోమగాములు స్పేస్ వాక్ చేసిన మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలనే వినియోగించడం మరో ప్రత్యేకత. కాగా, మస్క్ మరో మూడేళ్లలో ప్రపంచ తొలి ట్రిలియనీర్ (రూ.85 లక్షల కోట్లు)గా అవతరించనున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమం ట్విటర్ ను రూ.3 లక్షల కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన మస్క్.. దాని పేరు ‘ఎక్స్’గా మార్చారు.