యూట్యూబ్ లో అప్ లోడైన మొట్టమొదటి వీడియో ఇదే!
యూట్యూబ్ లోని మొదటి వీడియోకు "మి అట్ ది జూ" అనే పేరు పెట్టారు. ఈ వీడియో 23 ఏప్రిల్ 2005న రాత్రి 8.27 గంటలకు అప్ లోడ్ చేయబడింది.
గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ యూట్యూబ్ గురించీ ఈ ప్రపంచంలో 90శాతం జనాలకు పరిచయం అవసరం లేదన్నా అతిశయోక్తి కాదేమో! ఆ స్థాయిలో ఈ పేరు మారుమ్రోగి పోయింది. వంట చేయాలన్నా.. మొదటిసారి గాడ్జెట్ ను ఇన స్టాల్ చేయాలన్నా.. పిల్లలకు పిట్ట కథలు చెప్పాలన్నా కూడా ఇప్పుడు యూట్యూబ్ ఓన్లీ ఆప్షన్ అయిపోయిన పరిస్థితి.
ఈరోజుల్లో ప్రజలకు సంపాదన, వినోదం, జ్ఞానం మొదలైనవాటికి సాధనంగా మారిన పాపులర్ ఫ్లాట్ ఫాం ఇదే. అయితే ఈ స్థాయిలో కోట్ల వీడియోలు కలిగి ఉన్న ఈ యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో ఎప్పుడు మొదలైంది.. ఆ వీడియోని ఎవరు పోస్ట్ చేశారు.. ఎక్కడ నుంచి పోస్ట్ చేశారు.. ఏ విషయం పై పోస్ట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.
అవును... నేడు కొన్ని కోట్ల వీడియోలతో నిండిపోయిన ఈ యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో ఎప్పుడు పోస్ట్ అయ్యి ఉంటుంది.. ఎవరు పోస్ట్ చేసి ఉంటారు అనే ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే దీనీకి సంబంధించిన సమాధానం.. ఆ వీడియోకి వచ్చిన వ్యూస్,ఇచ్చిన లైక్స్,కామెంట్స్ అన్నీ రికార్డు స్థాయిలోనే ఉన్నాయి!
యూట్యూబ్ లోని మొదటి వీడియోకు "మి అట్ ది జూ" అనే పేరు పెట్టారు. ఈ వీడియో 23 ఏప్రిల్ 2005న రాత్రి 8.27 గంటలకు అప్ లోడ్ చేయబడింది. అంటే... సుమారు 18ఏల్ల కిందట అన్నమాట. శాన్ డియాగో జూ సందర్శనకు వెళ్లిన జావేద్ కరీమ్ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు.
అతను ఈ వీడియోలో జూలో ఉన్న ఏనుగులకు సమీపంలో నిలబడి వాటి గురించి ప్రాథమిక సమాచారాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. జావెద్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ వీడియోను చూడవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకు 281 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా... 14 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.
ఇంత చరిత్ర ఉన్న ఆ వీడియో నిడివి ఎంతంటారా... కేవలం 19 సెకన్లు!
కాగా... ఫిబ్రవరి 14 - 2005న యూట్యూబ్ ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సబ్ స్క్రైబ్ చేయబడిన యూట్యూబ్ ఛానెల్ గా టి-సిరీస్ ఉంది. దీనికి 246 మిలియన్ల మంది సభ్యులుగా ఉన్నారు. దీని తర్వాత మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఇది 171 మిలియన్ల మంది సబ్ స్క్రైబ్ చేయబడింది.