ఎంపీలో ఢిల్లీ తరహా ఘటన... ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య!
అవును... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సోంద్వా తహసీల్ లో గల రవ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లో విగత జీవులై పడి ఉన్నారు. మృతులను తండ్రి రాకేష్ దొడ్వా (27), తల్లి లలితా దొడ్వా (25) ముగ్గురు పిల్లలు వరుసగా లక్ష్మీ (9), ప్రకాష్ (7), అక్షయ్ (5) ఉన్నారు.
అవును... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలను పోలీసులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు అలీరాజ్ పూర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని బృందం సమాయత్తమైందని అధికారి తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెళ్లి చూసే సరికి రాకేష్, లలిత, ప్రకాష్, అక్షయ్ ల మృతదేహాలు పైకప్పుకు వేలాడుతూ కనిపించగా.. కుమార్తె లక్ష్మి మాత్రం నేలపై విగతజీవిగా పడి ఉందని చెబుతున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారని తెలుస్తుంది.
అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆ ఘటన జరిగిన చోట ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. వీరి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో... గతంలో గుజరాత్, ఢిల్లీలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు.
గత ఏడాది గుజరాత్ లో నమోదైన కేసుకు కూడా ఇదే తరహా మాస్ సూసైడ్ కి సంబంధించినదే కావడం గమనార్హం. ఇందులో భాగంగా... అక్కడ ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యులు వారి నివాసంలోనే మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. సూరత్ లోని పాలన్ పూర్ జకత్నాక్ రోడ్డు ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెబుతారు!
ఇదే సమయంలో 2022లో మహారాష్ట్రలోని మహైసల్ గ్రామంలోనూ ఈ తరహా ఘటనే జరిగింది. ఇందులో భాగంగా ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదే క్రమంలో సుమరు నాలుగు సంవత్సరాల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ప్రాణాలు తీసుకున్నట్లు కనుగొనబడింది.