కాంక్రీట్ లో ఆహార వ్యర్థాలు కలిపితే.... ఐఐటీ కీలక అప్ డేట్!

సాధారణంగా మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను చెత్తబుట్టలో పడేస్తుంటారనే సంగతి తెలిసిందే.

Update: 2025-02-27 03:15 GMT

సాధారణంగా మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను చెత్తబుట్టలో పడేస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే... హానికరం కానీ బ్యాక్టీరియాతో కూడిన ఆ వ్యర్థాలను కాంక్రీటులో కలపడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ.. ఐఐటీ ఇండోర్ పరిశోధనలో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది.

అవును... పండ్లు, కొన్ని కూరగాయలు, తినగా మిగిలిన పీచు, తొక్కలు వంటి వ్యర్థాల వల్ల చాలా లాభాలున్నాయని.. వీటిని కాంక్రీట్ లో కలిపితే నిర్మాణాలు చాలా దృఢంగా ఉంటాయని పరిశోధనలో వెల్లడైందని ఐఐటీ ఇండోర్ పరిశోధన బృందం తెలిపింది. ఇదే సమయంలో.. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని వెల్లడించింది.

ఈ సందర్భంగా స్పందించిన ప్రొఫెసర్ సందీప్ చౌదరి... పండ్లు, కూరగాయల వ్యర్థాలు కుళ్లిపోయినప్పుడు దాని నుంచి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని.. అయితే, హానికర బ్యాక్టీరియా లేని వ్యర్థాలను కాంక్రీటులో కలిపినప్పుడు దానిలోని కాల్షియం అయాన్ లతో కార్బన్ డై ఆక్సైడ్ చర్య జరుపుతుందని తెలిపారు.

దీనివల్ల స్పటికాలు ఏర్పడతాయని.. అవి కాంక్రీట్ లో ఉన్న రంధ్రాలు, పగుళ్లలో చేరతాయని.. ఫలితంగా నిర్మాణం మరింత బలంగా మారుతుందని తెలిపారు. ఈ పరిశోధనలో.. కాలీఫ్లవర్, మెంతికూర కాడలు.. బంగాళాదుంప, నారింజ తొక్కలతో పాటు కుల్లిన బొప్పాయి గుజ్జు వంటి వ్యర్థాలతో హానికరం కాని బ్యాక్టీరియాను కాంక్రీటులో కలిపి పరిశీలించామని అన్నారు.

ఒక్కసారి కాంక్రీట్ లోని రంధ్రాలు పూడ్చిన అనంతరం ఇక ఆ బాక్టీరియా పెరగదని.. ఆ తర్వాత నిర్మాణానికి ఎలాంటి హానీ ఉండదని.. ఈ ప్రక్రియ రసాయన వాడకాలను తగ్గించి, నా

Tags:    

Similar News