సిద్ధిఖ్ హత్య తర్వాత ఫేస్ బుక్ లో ముఠా సభ్యుడు పెట్టిన పోస్ట్ లో ఏముంది?

ఈ సమయంలో ఫేస్ బుక్ లో వెలిసిన ముఠా సభ్యుడి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది!

Update: 2024-10-13 10:45 GMT

ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా ప్రకటించింది. శనివారం రాత్రి దసరా వేడుకల సందర్భంగా ముంబైలోని బంద్రాలోని కార్యాలయం వెలుపల సిద్ధిఖ్ కాల్చి చంపబడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఫేస్ బుక్ లో వెలిసిన ముఠా సభ్యుడి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది!

అవును... ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తో ఉన్న సంబంధాల కారణంగా సిద్ధిఖ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ మేరకు ఒక ముఠా సభ్యుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడని తెలుస్తోంది! ఈ పోస్ట్ లో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటనలో నిందితుడైన అనుజ్ ధాపన్ గురించి కూడా ఈ పోస్ట్ లో ప్రస్తావించబడిన పరిస్థితి! అతను పోలీస్ కస్టడీలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయాన్ని ప్రస్థావించారని అంటున్నారు!

ఈ పోస్ట్ లో ముఠా సభ్యుడు.. "ఓం, జై శ్రీరామ్, జై భారత్" అని ప్రాశాడని తెలుస్తోంది. ఈ సందర్భంగా "సల్మాన్ ఖాన్... మేము ఈ యుద్ధం కోరుకోలేదు కానీ.. మీరు మా అన్నయ్య ప్రాణాలు కోల్పోయేలా చేశారు. మాకు ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదు.. అయితే.. సల్మాన్ ఖాన్ కి, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కు సహాయం చేసేవారెవరైనా సిద్ధంగా ఉండాలి" అని రాసుకొచ్చాడని అంటున్నారు!

ఇదే సమయంలో.. "మా సోదరులు ఎవరైనా చనిపోతే దానికి మేము ప్రతిస్పందిస్తాము.. మేము ఎప్పుడూ సమ్మే చేయము.. జై శ్రీరామ్.. జై భారత్.. వందనం అమరవీరులకు" అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు! ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. దీని ప్రామాణికతను పరిశీలించే పనిలో ముంబై పోలీస్ ఉన్నారని అంటున్నారు!

కాగా... గత కొన్ని సంవత్సరాలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అనేక బెదిరింపులను ఎదుర్కొన్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అతని నివాసం వెలుపల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News