విశాఖ 'లక్కీ భాస్కర్' స్టూడెంట్స్ కథ... సుఖాంతం అయ్యింది ఇలా!

సాధారణంగా సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాలోని హీరో పాత్రలాగా కొంత మంది పిల్లలు ఇంట్లో ప్రయత్నిస్తుంటారు.

Update: 2024-12-12 05:08 GMT

సాధారణంగా సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాలోని హీరో పాత్రలాగా కొంత మంది పిల్లలు ఇంట్లో ప్రయత్నిస్తుంటారు. అయితే... విశాఖలో మాత్రం నలుగురు పిల్లలపై "లక్కీ భాస్కర్" ప్రభావం బాగా ఎక్కువగా పడిందని.. ఫలితంగా హాస్టల్ నుంచి పారిపోయారనే విషయం తుపాకీ పాఠకులకు విధితమే. అయితే.. తాజాగా ఆ నలుగురూ దొరికారు.

అవును... విశాఖపట్నంలోని హాస్టల్ లో ఉండి 9వ తరగతి చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయిన సంగతి తెల్సిందే. దీనిపై హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆ విద్యార్థుల తల్లితండ్రులకూ విషయం తెలియజేశారు. వీరు పారిపోవడానికి "లక్కీ భాస్కర్" సినిమా కారణం అయ్యిందనే చర్చ ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా చూసిన తర్వాతా దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కి ఆ విద్యార్థులు బాగా కనెక్ట్ అయిపోయారని.. ఆ సినిమాలో లాగానే బాగా డబ్బులు సంపాదించి, కార్లు కొన్న తర్వాత తిరిగి వస్తామని హోస్టల్ నుంచి తప్పించుకుని పారిపోయినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని వీరే వారి స్నేహితులకు చెప్పారంట.

ఈ నలుగురు విద్యార్థులూ హాస్టల్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసిన సీసీ టీవీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది! ఈ సమయంలో.. ఈ విద్యార్థుల ఆచూకీ తెలుసుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సమయంలో వారి ఆచూకీ తెలుసుకున్నారు. ఈ నలుగురు ప్రస్తుతానికి జిల్లా దాటగలిగారని అంటున్నారు.

ఇలా విశాఖపట్నంలోని హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన నలుగురు విద్యార్థుల కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఇదే సమయంలో వారి ఫోటోలను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ పంపించారు. అయితే వారి ఆచూకీ విజయవాడలో దొరికిందని అంటున్నారు. ఈ నలుగురూ విజయవాడలో బ్యాగులతో తిరుగుతున్నారంట.

ఈ నలుగురు విద్యార్థులూ విజయవాడలోని మొగల్రాజపురంలో బ్యాగులతో తిరుగుతుండగా.. గుర్తించిన పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారని అంటున్నారు. అనంతరం విచారించి.. విజయవాడ నుంచి విశాఖకు పంపించారని చెబుతున్నారు. ఇలా... విశాఖలోని 'లక్కీ భాస్కర్' స్టూడెంట్స్ కథ సుఖాంతం అయ్యింది.

Tags:    

Similar News