"స్వేచ్ఛ సిరియా"... తిరుగుబాటు దారుల విజయోత్సవ ప్రకటన!

ఈ సమయంలో దేశ రాజధాని డమాస్కస్ ను కూడా తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. దీంతో.. అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-12-08 18:45 GMT

గత కొంతకాలంగా సిరియాలో అంతర్యుద్ధంతో తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా గత కొన్ని రోజులుగా తిరుగుబాటుదారులు ఒక్కో పట్టణాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో దేశ రాజధాని డమాస్కస్ ను కూడా తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. దీంతో.. అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... సిరియాలో గత కొంత కాలంగా కొనసాగుతోన్న అంతర్యుద్ధంలో తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రాజధాని డమాస్కస్ తో పాటు పలు నగరాలను ఆక్రమించుకున్నారు తిరుగుబాటు దారులు. దీంతో.. దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్.. రాజధాని విడిచి చెళ్లినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా తిరుగుతుబాటుదారులు కీలక ప్రకటన చేశారు.

ఇందులో భాగంగా... నిరంకుశ పాలకుడు దేశం విడిచి పారిపోవడంతో సిరియాకు విముక్తి లభించిందని.. వీరి పాలనలో సుమారు 50 ఏళ్ల అణచివేత, 13 ఏళ్ల దౌర్జన్యం వల్ల ఎందరో సిరియన్లు ఇతర దేశాలకు వెళ్లిపోయారని.. ఈ రోజుతో ఈ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నామని.. ఇకపై సిరియాలో కొత్త శకం ప్రారంభమైందని అన్నారు.

అందువల్ల... విదేశాలకు వెళ్లిపోయిన సిరియన్లు అంతా తిరిగి "స్వేచ్ఛ సిరియా"లోకి రావాలని కోరుతున్నట్లు తిరుగుతుబాటుదారులు ప్రకటించారు. ఈ సందర్భంగా.. సిరియా రాజధానిని చుట్టుముట్టడం ద్వారా అపరేషన్ చివరి దశను ప్రారంభించినట్లు "హయత్ తహరీర్ అల్ షం" నేతృత్వంలోని తిరుగుబాటుదళాల ప్రతినిధి హసన్ అబ్దుల్ ఘనీ ప్రకటించారు.

కాగా.. సిరియాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంతో కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. సిరియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవ్వరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవారకూ ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే అక్కడున్న భారతీయులు అంతా అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని.. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్ లోని భారత ఎంబసీతో టచ్ లో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా... +963993385973 హెల్ లైన్ ని సంప్రదించాలని తెలిపారు.

Tags:    

Similar News