జగన్ హత్యకు కుట్ర అంటూ సన్నిహిత నేత !

కోడి కత్తి కేసు వెనక సూత్రధారులు ఉన్నారని విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ని హత్య చేయడానికి కొందరు ఆనాడు పధక రచన చేశారు అని ఆయన ఆరోపిస్తున్నారు.;

Update: 2025-04-14 18:11 GMT
జగన్ హత్యకు కుట్ర అంటూ సన్నిహిత నేత !

వైసీపీలో జగన్ కి స్కూల్ డేస్ నుంచి దోస్త్ రాజకీయాల్లో మిత్రుడు అత్యంత సన్నిహితుడు అయిన నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఆయన జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని రాప్తాడు పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపాలను ఎత్తి చూపుతూ ఆరోపించారు. ఇపుడు ఏకంగా జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది అని బాంబు పేల్చారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తాను అనడం కోడి కత్తి శ్రీను ఆయన వెళ్ళడం మీద మాట్లాడుతూ ఇవన్నీ చూస్తూంటే కొత్తగా అనేక భయాలు వస్తున్నాయని అన్నారు.

కోడి కత్తి కేసు వెనక సూత్రధారులు ఉన్నారని విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ని హత్య చేయడానికి కొందరు ఆనాడు పధక రచన చేశారు అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇపుడు మళ్ళీ పాత శక్తులే కలుస్తున్నాయని కూడా ఆయన అంటున్నారు.

ఇక ఏబీ వెంకటేశ్వరరావు జగన్ ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం మీద కూడా ఆయన ఫైర్ అయ్యారు. మాజీ డీజీ హోదాలో పనిచేసిన వెంకటేశ్వరరావు కోడి కత్తి శ్రీను తో చర్చించడమేంటని అన్నారు. పక్కా ప్రణాళికతో ఈసారి జగన్ హత్యకు తెర వెనక కుట్రకు అంతా సిద్ధం అవుతోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. మరో వైపు చూస్తే ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాదని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని గడికోట విమర్శించారు. ఏపీలో వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నిజంగా చూస్తే ఏపీలో హత్యా రాజకీయాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటిదాకా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు ప్రతి విమర్శలు తప్పించి మరే విధమైన చర్యలూ లేవు. ఏపీ అంటే హీటెడ్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఉన్నా కూడా మరీ ఈ స్థాయిలో తెగబడి ప్రధాన రాజకీయ నాయకులకే గురి పెడతారు అని ఎవరూ అనుకోవడం లేదు. అయితే వైసీపీ మాత్రం ఈ విమర్శలు చేస్తోంది. మరి వీటి వెనక ఏమి ఉందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News