కర్ణాటకలో విదేశీ పర్యాటకులపై దాడి... తెరపైకి దారుణ విషయాలు!

వీరంతా సమీపంలోని హోంస్టేలో బస చేశారు. ఈ సమయంలో సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు.;

Update: 2025-03-08 12:30 GMT

కర్ణాటకలోని గంగావరి ప్రాంతానికి గురువారం ఇజ్రాయెల్ కు చెందిన యువతి, అమెరికాకు చెందిన డేనియల్, నాసిక్ కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ పర్యటనకు వచ్చారు. వీరంతా సమీపంలోని హోంస్టేలో బస చేశారు. ఈ సమయంలో సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు.

ఆ సమయంలో కొంతమంది దుండగులు వచ్చి అక్కడ ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో... ఇజ్రాయెల్ కు చెందిన యువతితో పాటు మరో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతకంటే ముందు పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందంటూ వారితో మాటలు కలిపారని.. అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారని హోంస్టే యజమాని తెలిపారు.

అయితే.. అందుకు పర్యాటకులు నిరాకరించడంతో పురుషులను కాలువలోకి తోసి.. మహిళలపై అత్యాచరానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగుల్లు అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమయంలో ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

అవును... కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పర్యాటకులపై గురువారం అర్ధరాత్రి దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. కాలువలో గల్లంతైన ఒడిశాకు చెందిన బిబాస్ అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో ఇజ్రాయెల్ కు చెందిన ఓ యువతి, మరో మహిళపై ముగ్గురు దుండగులు దాడి చేయడమే కాకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు సూపరింటెండెంట్ రామ్ ఎల్ అరసిద్ధికి కి బాధితులు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News