రుషికొండలో రహస్య భవనాలు.. బాత్ టబ్ రూ.26 లక్షలు?

ఈ నేపథ్యంలో ఆ విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

Update: 2024-06-16 11:30 GMT

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అని.. ఆ ప్రాంతానికి ఆ అవకాశం ఉందని వైసీపీ నేతలు బలంగా చెప్పేవారు. చిన్న బూస్ట్ ఇస్తే చాలు విశాఖ... బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల సరసన చేరుతుందని అనేవారు. ఆ సంగతి అలా ఉంటే... ఆ సమయంలో రుషికోండ టాపిక్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.


అవును... రుషికొండ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై నాడు విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. రుషికొండకు గుండు గీసేస్తున్నారాని.. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నారనే ఆరోపణలూ తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం మారిన అనంతరం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నేతలు రిషికొండ పర్యటన చేపట్టారు.


ఇందులో భాగంగా... స్థానిక నాయకులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో రుషికోండ భవనాలను పరిశీలించారు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. పలు విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... రుషికొండలో గత ప్రభుత్వ పెద్దలు రహస్యంగా విలాస భవనాలను కట్టారని.. తొలుత పర్యాటకం అని చెబుతూ, అనంతరం పరిపాలనా భవానలు అని చెప్పారని అన్నారు.

వీటికోసం సుమారు రూ.450 కోట్ల ప్రజాధనాన్ని ఏమి చేశారని గంటా ప్రశ్నించారు. ఈ భవనాల కాంట్రాక్టులు కూడా వైసీపీ నేతలకే ఇచ్చారని.. రుషికొండ భవనాలను సీఎం చంద్రబాబుకు చీపిస్తామని.. ఈ భవనాల విషయమై ఫైనల్ గా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని గంటా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

గతంలో అనుమతులు లేవని, అక్రమ నిర్మాణాలనీ ప్రభుత్వ భవనాలైన ప్రజావేదికనే కూల్చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు రుషికొండ భవనాలకు ఎలా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. పైగా గతంలో ఎవరినీ అనుమతించకుండా గతంలో టూరిజం మంత్రి వీటిని ప్రారంభించారని తెలిపారు. అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు కట్టారో చెప్పాలని గంటా ప్రశ్నించారు.

Tags:    

Similar News