అదానీ దగ్గ‌ర 4 వేల కోట్లు లేవా? చిత్రం క‌దా!

త‌న‌కు రూ.4 వేల కోట్లు(600 మిలియ‌న్ డాల‌ర్లు) అప్పు కోసం.. కీల‌క బ్యాంకుల‌ను అంటే ఎస్ బీఐ.. త‌దిత ర బ్యాంకుల‌ను కోరుతున్నారు.

Update: 2024-05-07 15:30 GMT

గౌతం అదానీ.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గుజ‌రాత్‌కు చెందిన ఈయ‌న‌.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అంటే 2014 నుంచి పెద్ద ఎత్తున ఫేమ‌స్ అయ్యారు. ప్ర‌పంచ కుబేరుల్లోనూ.. ఆయ‌న రెండు-మూడు స్థానాల్లో ఉన్నారంటే అతిశ‌యోక్తికాదు. అంత‌టి కుబేరుడు.. ప్ర‌పంచ స్థితి మంతుడు.. ఇప్పుడు రూ.4 వేల కోట్ల కోసం.. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నార‌ట‌! ఇది నిజం. త‌న‌కు రూ.4 వేల కోట్లు కావాలంటూ.. బ్యాంకుల‌తో చ‌ర్చ‌లు చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

త‌న‌కు రూ.4 వేల కోట్లు(600 మిలియ‌న్ డాల‌ర్లు) అప్పు కోసం.. కీల‌క బ్యాంకుల‌ను అంటే ఎస్ బీఐ.. త‌దిత ర బ్యాంకుల‌ను కోరుతున్నారు. ఈ మేర‌కు అదానీ టోట‌ల్ వింగ్‌కు చెందిన ధామ్రా ఎల్ ఎన్‌జీ టెర్మిన‌ల్ ఈ లోన్ కోసం.. ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే ఉన్న రుణాన్ని తిరిగి చెల్లిస్తామ‌ని.. త‌మ‌కు మ‌రింత రుణం కావాల‌ని.. ఈ సంస్థ స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తులో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ మొత్తం చెల్లించేందుకు మూడు నుంచి ఐదేళ్ల గ‌డువు విధించిన‌ట్టు స‌మాచారం.

అయితే.. చిత్రం ఏంటంటే.. దేశ‌వ్యాప్తంగా తీర‌ప్రాంతం(9వేల కిలోమీట‌ర్లు)లో స‌గానికిపైగా అదానీ చేతి లోనే ఉంది. ఏపీలోని ఒకటి రెండు పోర్టులు త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీ.. అదానీ చేతిలోనే ఉన్నాయి. గుజ‌రాత్ లో అయితే.. పూర్తిగా ఆయ‌నే నిర్వ‌హిస్తున్నారు. ఇవికాకుండా.. అదానీ మ‌రికొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్స్‌పోర్టు రంగంలో అగ్ర‌గామిగా ఉన్నారు. ఇంత‌టి స్థితి మంతుడు.. ఇంత‌టి కోటీశ్వ‌రుడు.. ఇప్పుడు అప్పు చేయ‌డం ఏంటి? అనేది ప్ర‌శ్న‌.

అయితే.. దీనివెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనేది ప్ర‌శ్న కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. కాంగ్రెస్ పార్టీ అదానీ వ్య‌వ‌హారాన్ని ఉత్త‌రాదిలో బాగానే ప్ర‌స్తావించింది. మోడీకి అదానీకి మ‌ధ్య అనుబంధం ఉంద‌ని చెబుతోం ది. మోడీ వ‌చ్చాకే అదానీ ఆస్తులు పెరిగిపోయాయ‌ని.. దేశ ప్ర‌జ‌ల సంప‌ద అంతా వారికి దోచి పెడుతున్నా ర‌ని.. కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఇది ఎన్నిక‌ల వేళ బీజేపీకి ఇబ్బందిగానే మారింది. ఈ నేప‌థ్యంలో ``నేను ఆస్తుల్లో మేటి కాదు.. ఓటి.. అప్పులు చేసే ప‌రిస్థితిలో ఉన్నాను`` అనిఅదానీతోనే న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పిస్తున్నారా? అనేది సందేహం. ఏదేమైనా.. అదానీ అప్పులు చేయ‌డం అంటే.. కుబేరుడు అప్పు చేసిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News