మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం... భారీగా పెరిగిన మృతులు, బాధితులు!

ఈ సమయంలో తాజాగా మహారాష్ట్రలో దీని విజృంభణ వైరల్ గా మారిందని చెబుతున్నారు.

Update: 2025-02-15 07:38 GMT

ప్రస్తుతం దేశంలో గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తొలి కేసులు పూణెలో తొలిసారిగా వెలుగుచూసినట్లు కథనాలు రాగా ఇప్పుడు మహారాష్ట్రలో వీటి సంఖ్య వందలకు చేరిందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా మహారాష్ట్రలో దీని విజృంభణ వైరల్ గా మారిందని చెబుతున్నారు.

అవును... మహారాష్ట్రలో గులియన్ బారీ సిండ్రోమ్ తీవ్ర కలలం రేపుతోంది! ఇందులో భాగంగా... ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207కు పెరిగిందని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మొత్తం రోగుల్లో 180 మందికి జీబీఎస్ నిర్ధారించబడగా.. మిగిలిన రోగులలో వ్యాధి లక్షణాలు ఉన్నాయని.. వారికి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ మొత్తం 9 మంది మరణించినట్లు చెబుతున్నారు. అయితే.. వారిలో నలుగురు పూర్తిగా జీబీఎస్ కారణంగానే మరణించినట్లు చెబుతుండగా.. మిగిలినవారు అనుమానిత జీబీఎస్ రోగులుగా మృత్యువాతపడ్డారని అంటున్నారు.

వాస్తవానికి బుధవారం వరకూ ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మరణాలు ఉండగా.. తొమ్మిదో మరణం ఫిబ్రవరి 13న కొల్హాపూర్ లో సంభవించిందని చెబుతున్నారు.

కాగా... ఆంధ్రప్రదేశ్ లోనూ గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదవుతుండటం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. గుంటూరు జీజీహెచ్ లో ఏడుగురు బాధితులు ఈ సమస్యతో చేరగా.. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలినవారు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యప్తంగా ప్రస్తుతం 18 యాక్టివ్ కేసులున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇందులో భాగంగా... గుంటూరులో 5, విశాఖలో 6, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కోటి చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు!

Tags:    

Similar News