2019 సార్వత్రిక ఎన్నికలు ఏ దశలో ఏయే రాష్ట్రాల్లో జరిగాయి?
కొత్త సంవత్సరం వచ్చేసింది. దేశ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ ఏడాది మొదట్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
కొత్త సంవత్సరం వచ్చేసింది. దేశ రాజకీయాలకు సంబంధించి అత్యంత కీలకమైన ఈ ఏడాది మొదట్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభకు ఎన్నికలుజరగటంతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటివేళ.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఏయే దశల్లో జరిగాయన్నది ఒక లెక్క అయితే.. ఏ రాష్ట్రాల్లో ఏయే దేశల్లో ఎన్నికలు జరిగాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరిగిన విషయం తెలిసిందే.
ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్ల ప్రక్రియలను పక్కన పెడితే.. దశల వారీగా పోలింగ్ తేదీలను పరిగణలోకి తీసుకుంటే.. ఏప్రిల్ 11న మొదటి దశ షురు కాగా.. 7 దశ పోలింగ్ మే 19న జరిగింది. మొదటి దశలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగానే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతో పాటు.. అసెంబ్లీకి సైతం పోలింగ్ పూర్తైంది. మొత్తం 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ 91 స్థానాలకు.. రెండో దశలో 95 స్థానాలకు.. మూడో దశలో 116 స్థానాలకు.. నాలుగోదశలో 71 స్థానాలకు.. ఐదో దశలో 50 స్థానాలకు.. ఆరో దశలో 59 స్థానాలకు.. ఏడో దశలో మిగిలిన 59 స్థానాలకు పోలింగ్ జరిగింది.
మొదటి దశ పోలింగ్ పూర్తి అయ్యే నాటికి దేశంలోని మొత్తం లోక్ సభ స్థానాల్లో కేవలం 17 శాతం పూర్తి కాగా.. రెండోదశ పూర్తి అయ్యే నాటికి 34 శాతం.. మూడో దశ పూర్తి అయ్యేటానికి 56 శాతం.. నాలుగో దశ పూర్తయ్యేసరికి 69 శాతం.. ఐదో దశ పూర్తయ్యేసరికి 78 శాతం.. ఆరో దశ పూర్తి అయ్యేనాటికి 89 శాతం కాగా ఏడో దశ పోలింగ్ ముగిసేసరికి మొత్తం వంద శాతం స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలకు మొదటి దశలోనే పోలింగ్ పూర్తైంది. బిహార్.. ఉత్తరప్రదేశ్.. పశ్చిమ బెంగాల్.. జమ్ముకశ్మీర్ లాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రం ప్రతి దశలోనూ కొన్ని స్థానాలు చొప్పున పోలింగ్ జరిగింది. దేశంలోని పలు రాష్ట్రాలకు దశల వారీగా జరిగిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను చూస్తే..
మొదటి దశలో పోలింగ్ జరిగిన రాష్ట్రాలు..
ఆంధ్రప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్
అసోం
బీహార్
ఛత్తీస్ గఢ్
జమ్ముకశ్మీర్
మహారాష్ట్ర
మణిపూర్
మేఘాలయ
మిజోరం
నాగాలాండ్
ఒడిశా
సిక్కిం
తెలంగాణ
త్రిపుర
ఉత్తరప్రదేశ్
ఉత్తరాఖండ్
పశ్చిమబెంగాల్
అండమాన్ నికోబార్ దీవులు
లక్షద్వీప్
రెండో దశలో పోలింగ్ జరిగిన రాష్ట్రాలు
అసోం
బిహార్
ఛత్తీస్ గఢ్
జమ్మూకశ్మీర్
కర్ణాటక
మహారాష్ట్ర
మణిపూర్
ఒడిశా
తమిళనాడు
ఉత్తరప్రదేశ్
పశ్చిమబెంగాల్
పుదుచ్చేరి
3దశ పోలింగ్ జరిగిన రాష్ట్రాలు
అసోం
బిహార్
ఛత్తీస్ గఢ్
గోవా
గుజరాత్
జమ్ముకశ్మీర్
కర్ణాటక
కేరళ
మహారాష్ట్ర
ఒడిశా
త్రిపుర
ఉత్తరప్రదేశ్
పశ్చిమబెంగాల్
దాద్రా నగర్ హవేలీ
డామన్ డయ్యూ
4వ దశ పోలింగ్ జరిగిన రాష్ట్రాలు
బిహార్
జమ్ముకశ్మీర్
జార్ఖండ్
మధ్యప్రదేశ్
మహారాష్ట్ర
ఒడిశా
రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
పశ్చిమబెంగాల్
5దశలో ఎన్నికల పోలింగ్ జరిగిన రాష్ట్రాలు
బిహార్
జమ్ముకశ్మీర్
జార్ఖండ్
మధ్యప్రదేశ్
రాజస్థాన్
ఉత్తరప్రదేశ్
పశ్చిమబెంగాల్
6 దశ ఎన్నికల పోలింగ్ జరిగిన రాష్ట్రాలు
బిహార్
హర్యానా
జార్ఖండ్
మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్
పశ్చిమబెంగాల్
ఢిల్లీ
7 దశ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు
బిహార్
హిమాచల్ ప్రదేశ్
జార్ఖండ్
మధ్యప్రదేశ్
పంజాబ్
ఉత్తరప్రదేశ్
పశ్చిమబెంగాల్
చండీగఢ్