మూత్రం పోసి ఇంట్లో ఆహారం తయారీ.. పని మనిషి వీడియో వైరల్!

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్ లోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఓ పని మనిషి సుమారు ఎనిమిదేళ్లుగా పనిచేస్తుంది.

Update: 2024-10-16 23:30 GMT

ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలకు ఎలా రియాక్టవ్వాలో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పినా అతిశయోక్తి కాదేమో. సుమారు ఎనిమిదేళ్లుగా ఓ ఇంట్లో పనిచేస్తున్న ఓ వంట మనిషి... ఆ ఇంట్లోవారికి తన మూత్రం పోసి చపాతీలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

అవును... ఓ ఇంటీలో వంటచేసే మనిషి చపాతీ పిండిలో మూత్రం వేసి కలుపుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రికార్డ్ అయ్యిందని చెబుతున్నారు. ఆ ఆహారాన్ని కుటుంబం మొత్తం తిన్నారని తెలుస్తోంది. వీడియో బయటపడటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్ లోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఓ పని మనిషి సుమారు ఎనిమిదేళ్లుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో... ఇంట్లోని వంటగదిలో ఇటీవల బంగాళాదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు మొదలైనవి దొంగిల్లించబడటం మొదలయ్యాయంట. దీంతో... వ్యాపారికి ఓ ఉపాయం తట్టింది.

ఇందులో భాగంగా అసలు వంటగదిలో ఏమి జరుగుతుంది.. దొంగతనం ఎలా జరుగుతుంది తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో మొబైల్ కెమెరా ఆన్ చేసి వంటగదిలో దాచిపెట్టాడు. అయితే పనిమనిషి పని ముగించుకుని వెళ్లిన తర్వాత కెమెరాలో రియార్డ్ అయిన వీడియోని చూశాడు. దీంతో.. ఒక్కసారిగా కళ్లు బైర్లుకమ్మే దృశ్యం అతడికి కనిపించింది.

ఆ కెమెరాలో... వంటగదిలో ప్రవేశించిన కొద్దిసేపటికి ఆ పనిమనిషి పాత్రలో మూత్రం పోసి, అదే మూత్రంతో పిండి పిసికి చపాతీలు చేయడం స్పష్టంగా కనిపించింది. అవి చేయడం పూర్తైన తర్వాత పిల్లలకు టిఫిన్ లో వాటిని ఇచ్చి వెళ్లింది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో.. వెళ్తూ వెళ్తూ కాయగూరలు వగైరా సంచిలో సర్దుకుని అక్కడ నుంచి వెళ్లింది.

దీంతో షాక్ తిన్న యజమాని... వెంటనే పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను పిలిచి టిఫిన్ బాక్స్ లో ఉన్న ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు.

అయితే... తొలుత తనకేమీ తెలియదని బుకాయించినా.. వీడియో చూపించిన తర్వాత చేసిన పనిని అంగీకరించింది! అయితే... ఈ పనికి ఒడిగట్టడానికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదని అంటున్నారు. అయితే... ఇదే మొదటిసారా.. లేక, ఇప్పటికే చాలా కాలంగా తమకు ఇలాంటి ఆహారాన్నే తినిపిస్తుందా అనే సందేహాన్ని సదరు వ్యాపారవేత్త వ్యక్తపరిచారు.

కాగా గత కొంతకాలంగా ఆ కుటుంబంలోని వారు లివర్ సంబంధిత వ్యాధులతో బాదపడుతున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News