అమరావతికి శుభవార్త!

పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Update: 2024-07-23 07:09 GMT

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో ‌ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతికి శుభవార్త వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించారు. అమరావతికి రూ.15 వేల కోట్లతో ప్రత్యేక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం వెనుకబడిన ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.

వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి చేస్తామని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామని, భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని, స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News