జన్వాడ ఫాంహౌస్ వ్యవహారం... తెరపైకి షాకింగ్ విషయం!

తెలంగాణలో ఇప్పుడు హైడ్రా అనేది అత్యంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-30 05:41 GMT

తెలంగాణలో ఇప్పుడు హైడ్రా అనేది అత్యంత చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెరువులు, ఎఫ్.టీ.ఎల్. పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫాంహౌస్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు.

అవును... ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జన్వాడ ఫాంహౌస్ కు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎలంటి అనుమతులూ లేవని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు. దీంతో... నెక్స్ట్ జన్వాడ ఫాంహౌసేనా అనే చర్చ మొదలయ్యింది!

ఈ మేరకు... శంకరపల్లి మండలం, జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్.. బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ పరిధిలో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేవెళ్ల రెవెన్యూ డివిజన్ అధికారులు ఇంటర్నల్ గా దీనికి సంబంధించి పలు కీలక అంశాలను సేకరించారని అంతున్నారు. వాస్తవానికి.. దీన్ని గతంలోనే గ్రామపంచాయతీ కార్యదర్శి అక్రమకట్టడంగా గుర్తించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో... ఈ ఫాంహౌస్ యజమాని ఎన్.ఎస్.ఎల్.ఆర్. ప్రసాద రాజు చిరునామాకు నోటీసులు సైతం పంపించారని అంటున్నారు. అయినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపొవడంతో... పంచాయతీ ఆదాయం నిమిత్తం కొద్ది రోజుల తర్వాత ఫాంహౌస్ కు ఇంటి నెంబర్ 4-5 కేటాయించి అసెస్మెంట్ చేసినట్లు చెబుతున్నారు.

దీంతో... జీప్లస్1 స్ట్రక్చర్ లో ఉన్న ఈ ఫాంహౌస్ విస్త్రీణం 362 గజాలని పంచాయతీ అధికారులు లెక్కలు వేసి, ఏటా రూ.11 వేలు పన్ను చెల్లించాలని సదరు అసెస్మెంట్ ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారట. దీంతో... నిర్వాహకులు ఏటా ఇంటిపన్ను చెల్లిస్తున్నారని అంటున్నారు. ఇది 111 జీవో పరిధిలో ఉందనే విషయాన్ని ఇటీవల హైడ్రా కమిషనర్ ధృవీకరించిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తూతం బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే పూర్తి చేశారని.. కీలక సమాచారం సేకరించారని.. ఈ ఫాంహౌస్ నాలా బఫర్ జోన్ లోకి వస్తుందా లేదా అనేది నిర్ధారించుకున్న తర్వాత ఈ వివరాలను కలెక్టర్ కు అందజేస్తారని తెలుస్తోంది. దీంతో... ఈ విషయంపై ఎలాంటి నివేదిక రాబోతుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News