గ్యారంటీల అమలుకోసం గం*జాయి సాగుకు గ్రీన్ సిగ్నల్ !

రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో గం*జాయి సాగు చేయాలని ఏకంగా శాసనసభలో చర్చ జరగగా ప్రతిపక్ష బీజేపీ పార్టీ దీనికి మద్దతు ఇవ్వడం గమనార్హం.

Update: 2024-09-10 22:30 GMT

డ్రగ్స్, గం*జాయిలకు అలవాటై బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు దీనిని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోతున్న హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా బలపడేందుకు గం*జాయి సాగును ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో గం*జాయి సాగు చేయాలని ఏకంగా శాసనసభలో చర్చ జరగగా ప్రతిపక్ష బీజేపీ పార్టీ దీనికి మద్దతు ఇవ్వడం గమనార్హం. అధికార, ప్రతిపక్ష పార్టీల సూచన మేరకు రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలో శాస్త్రవేత్తలు, ఉద్యాన నిపుణుల, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏకంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టడం విశేషం.

ఔషధ, శాస్త్రీయ, పారిశ్రామిక అవసరాల కోసం నియంత్రిత పద్దతిలో గం*జాయి సాగు చేయాలని ఇచ్చిన నివేదికను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. గం*జాయి సాగు పద్దతి సులభం కాబట్టి దీనికి ప్రజల మద్దతు కూడా ఉంటుందని, సాగును అనుమతించేందుకు నార్కోటిక్ నిబంధనలను సవరించాలని నిపుణుల కమిటీ సూచించడం విశేషం.

ఇటీవల గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. దీంతో అన్ని సబ్సిడీలకు ప్రభుత్వం కోతలు పెడుతున్నది. వేతనాలు, ఫించన్లను ఆలస్యంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గం*జాయిని సాగు చేయడం ద్వారా ఏటా రూ.2000 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News