పానీపూరీ వాలాకు జీఎస్టీ నోటీసులు.. కారణం తెలిస్తే షాకే
తాజాగా జీఎస్టీ నోటీసుకు ఒక పానీపూరీ వ్యక్తికి వచ్చిన జీఎస్టీ నోటీసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒక దేశం ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీ గురించి తెలిసిందే. వచ్చే వేళలో జీఎస్టీతో పన్నుల వాతలు తగ్గుతాయని భావిస్తే.. ఇప్పుడు ఏ చిన్న అవకాశం చిక్కినా పన్నుపోటుతో ప్రజల జేబులకు గాయాలవుతున్న దుస్థితి. రోజులు గడుస్తున్న కొద్దీ.. జీఎస్టీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ.. పన్నుల జాబితాలోకి వస్తువులు.. వస్తు సేవలు అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. డిజిటలైజేషన్ లో భాగంగా ఆన్ లైన్ పేమెంట్ల వైపే ప్రజలు మొగ్గు చూస్తున్న పరిస్థితి.
ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టే వేళలో.. చేతిలో పర్సు ఉందా? అని చెక్ చేసుకునే రోజులు పోవటం.. చేతిలోని స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని జేబులో పర్సు కానీ డబ్బులు కానీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకంటే. ఆన్ లైన్ లో పే చేయటం ఎంత ఎక్కువన్నది ఇట్టే అర్తం కావటానికి. తాజాగా జీఎస్టీ నోటీసుకు ఒక పానీపూరీ వ్యక్తికి వచ్చిన జీఎస్టీ నోటీసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం.. సదరు పానీపూరి బండి అతను ఏడాదికి రూ40 లక్షల వార్షిక ఆదాయాన్ని పొందుతున్నట్లుగా గుర్తించారు.
వెంటనే సదరు పానీపూరి వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. దీన్లో అతను ఆన్ లైన్ ద్వారా వార్సిక ఆదాయాన్ని 40 లక్షలుగా గుర్తించారు. ఇంత భారీ మొత్తం ఒక పానీపూరి షాపు యజమాని బ్యాంక్ ఖాతాకు రావటంతో ఫోకస్ పెట్టారు. అతడికి పంపిన నోటీసుల్లో ఫోన్ పే.. రేజర్ పే.. రికార్డుల ద్వారా పరిమితికి మించి యూపీఐ చెల్లింపులు స్వీకరించిన నేపథ్యంలో అతడికి నోటీసులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇంతకూ సదరు పానీపూరీ షాపు ఎక్కడ ఉందన్నది చూస్తే.. చెన్నైలో ఉంది. 2021-22 మొదలు వరుసగా మూడేళ్లు సదరు పానీపూరీ బండి అందుకున్న మొత్తం చెల్లింపులు రూ.40,11,019 గా జీఎస్టీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు.. జీఎస్టీ చట్టం ప్రకారం సదరు వ్యాపారి నమోదు కాలేదని తెలిపారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల మొత్తం టర్నోవర్ కలిగిన వారంతా నిబంధనల ప్రకారం జీఎస్టీ చట్టం ప్రకారం పేరును నమోదు చేసుకోవాలి. కానీ.. అలాంటిదేమీ లేకపోవటంతో.. సదరు పానీ పూరి బండి యజమానికి నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయటం నేరం. దీంతో రూ.10వేల ఫైన్ వేయటం గమనార్హం.