అపార్ట్ మెంట్ మొయింటెనెన్స్ పై జీఎస్టీ.. కేంద్రం తాజా క్లారిఫికేషన్

మహానగరాలు.. నగరాలు మాత్రమే కాదు పట్టణాల్లోనూ అపార్ట్ మెంట్లు వచ్చేస్తున్నాయి. వస్తువు.. వస్తు సేవ ఏదైనా దానికి జీఎస్టీ బాదేయటం తెలిసిందే.;

Update: 2025-04-14 04:01 GMT
అపార్ట్ మెంట్ మొయింటెనెన్స్ పై జీఎస్టీ.. కేంద్రం తాజా క్లారిఫికేషన్

మహానగరాలు.. నగరాలు మాత్రమే కాదు పట్టణాల్లోనూ అపార్ట్ మెంట్లు వచ్చేస్తున్నాయి. వస్తువు.. వస్తు సేవ ఏదైనా దానికి జీఎస్టీ బాదేయటం తెలిసిందే. మరి.. అపార్ట్ మెంట్ నెలవారీ మొయింటెనెన్స్ పై జీఎస్టీ ఉంటుందా? రూల్ పొజిషన్ ఏం చెబుతోంది? ఈ అంశంపై ఇటీవల కేంద్రం ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చింది? లాంటి అంశాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. అవును.. అపార్ట్ మెంట్ మొయింటెనెన్స్ పై కూడా జీఎస్టీ ఉంటుంది.కాకుంటే.. వాటికి కొన్ని మినహాయింపులు ఉంటాయి.

తాజాగా ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం సవివరంగా వివరించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో అయినా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలో ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మయింటెన్స్ రూ.7500 వరకు ఎలాంటి జీఎస్టీ ఉండదు. అదే సమయంలో నెలవారీగా రూ.7500కు మించి నెలవారీ నిర్వహణ ఖర్చుల కింద వసూలు చేస్తే మాత్రం దానిపై జీఎస్టీ కట్టాల్సిందే. అదే సమయంలో సదరు అసోసియేషన్ వసూలు చేసే మొయింటెనెన్స్ మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ.20 లక్షలు లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆర్ డబ్లయూఏ తన సభ్యుల నుంచి వసూలు చేసే నెలవారీ సబ్ స్క్రిప్షన్ లేదంటే కంట్రిబ్యూషన్ పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

మీకు ఇక్కడ కొన్ని సందేహాలు రావొచ్చు. అందులో మొదటిది..

ఒక హౌసింగ్ సొసైటీ లేదంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు అంత కంటే ఎక్కువ ప్లాట్లు ఉన్న వారి పరిస్థితేమిటి? అని. ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7500చొప్పున వేర్వేరుగా వర్తింపచేయాలని నిబందనలు చెబుతున్నాయి. అదే సమయంలో ఒక సభ్యుడు నెలవారీ మొయింటెనెన్స్ ను రూ.9వేల చొప్పున కడుతుంటే.. జీఎస్టీ ఎంత మొత్తం మీద పడుతుందన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. దీనికి కేంద్రం ఇచ్చిన క్లారిఫికేషన్ ఏమంటే.. రూ.9వేల మీదా 18 శాతం చొప్పున జీఎస్టీ చెల్లించాల్సిందే. అంతే తప్పించి రూ.7500 మినహాయింపు తీసేసి రూ.1500 మీద మాత్రమే జీఎస్టీ కడతానంటే ఒప్పుకోరు.

నిజానికి గతంలో అపార్ట్ మెంట్ మొయింటెనెన్స్ విషయంలో జీఎస్టీ మినహాయింపు నెలకు రూ.5 వేలు మాత్రమే ఉండేది. అయితే.. జీఎస్టీ కౌన్సెల్ తన 25వ సమావేశంలో అపార్ట్ మెంట్ మొయింటెనెన్స్ మీద జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.5 వేల నుంచి రూ.7500లకు పెంచింది. అప్పటి నుంచి ఇదే మొత్తం మినహాయింపుగా వస్తోంది. సో.. మీ అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ మీద జీఎస్టీ ఎంతన్న దానిపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది కదా?

Tags:    

Similar News