మహారాష్ట్రలో కొత్త వైరస్ కలకలం.. పెరుగుతున్న కేసులు.. లక్షణాలివే!
మహారాష్ట్రలో కొత్త వైరస్ ఒకటి కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా... పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్ బారే సిండ్రోమ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
వైరస్ అనే పదం వినిపిస్తేనే ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంటుంది. గత చేదు జ్ఞాపకాలు అలాంటివి అవ్వడమే అందుకు కారణం. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలో కొత్త వైరస్ వ్యాప్తి ఒకటి తీవ్ర కలకలం సృష్టిస్తోందని అంటున్నారు. ఈ సమయంలో ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 71 కాగా.. అందులో 14 మంది వెంటిలేటర్ పై ఉన్నట్లు చెబుతున్నారు.
అవును... మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం మహారాష్ట్రలో కొత్త వైరస్ ఒకటి కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా... పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ గులియన్ బారే సిండ్రోమ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ఆ కేసుల సంఖ్య 71కి చేరిందని అంటున్నారు. వీరిలో 47 మంది పురుషులు కాగా.. 24 మంది స్త్రీలు ఉన్నారు.
వీరిలో సుమారు 14 మంది వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న పరిస్థితి అని చెబుతున్నారు. వీరి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ర్యాపిడ్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేసిందని అంటున్నారు. ఈ వైరస్ పేరు గిలియన్ బరే సిండ్రోమ్ కాగా.. దీనికి వ్యాక్సిన్ లేదు!
ఇక.. ఈ వైరస్ శరీరంలోని నరాలపై దాడి చేస్తుందని.. దీంతో, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన వైద్యులు.. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదని.. అందువల్ల బాధితులు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పినట్లు కథనాలొస్తున్నాయి.
ఏమిటీ గిలియన్ బరే సిండ్రోమ్..?:
ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్య్యాది. ఈ వైరస్ సోకగానే నేరుగా నరాలపై దాడి చేస్తుందని చెబుతున్నారు. ఫలితంగా... కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, నరాల బలహీనత.. తీవ్రమైనప్పుడూ పక్షవాతం అచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇది అత్యంత అరుదైన వ్యాధి అని అంటున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయి?:
ఇక ఈ వైరస్ సోకిన వ్యక్తికి సంబంధించిన లక్షణాలపైనా ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా... ఈ వైరస్ సోకిన వ్యక్తి నడవడం, మెట్లు ఎక్కడం కష్టమవుతుందని.. కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు బలహీనమవుతాయని చెబుతున్నారు. ఇది నేరుగా నరాలపై దాడి చేయడం వల్ల.. మెదడులో అసాధారణ సంకేతాలు వస్తాయని అంటున్నారు.