అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్.. మరోసారి కాల్పుల మోత

తాజాగా మరోసారి అమెరికాలో కాల్పుల మోత మోగింది. నిన్న రాత్రి అలబామా రాష్ట్రంలో ఈ కాల్పులు జరిగాయి.

Update: 2024-09-22 10:30 GMT

ఇప్పటికే అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా.. మరోవైపు తుపాకుల మోత మోగుతోంది. ప్రపంచ అగ్రదేశం అమెరికాలో రోజురోజుకూ తుపాకీ కల్చర్ పెరుగుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట దుండగులు తెగబడుతున్నారు. నిత్యం అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైన కూడా ఇటీవల రెండు సార్లు గన్ అటాక్ జరిగింది.

తాజాగా మరోసారి అమెరికాలో కాల్పుల మోత మోగింది. నిన్న రాత్రి అలబామా రాష్ట్రంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో ప్రజలు ఎటూ తప్పించుకోలేకపోయారు. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఇద్దరు పురుషులు, ఓ మహిళ చనిపోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పలువురు గాయపడగా.. వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులే ఈ కాల్పులకు పాల్పడినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. అలబామా యూనివర్సిటీకి దగ్గరలోనే ఈ కాల్పులు జరిగాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని దుండగులు టార్గెట్ చేశారని తెలిపారు.

గతంలోనూ జార్జియాలోని ఓ పాఠశాలపై కాల్పులు కలకలం రేపాయి. జార్జియా బారో కౌంటీలోని ఓ హైస్కూల్‌లో ఈ ఘటన జరుగగా.. ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. అలాగే.. గత నెలలో ఇదే అలాబామా రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం

Tags:    

Similar News