ఎవరీ గురజా ప్రకాష్ రాజ్? ఎమ్మెల్సీ అభ్యర్థులకే సవాల్?

మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఒక ఓటరు సవాలుగా మారాడు.

Update: 2025-02-22 05:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా ఏపీలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఒక ఓటరు సవాలుగా మారాడు. అతని కోసం భూతద్దం వేసి మరీ వెతుకుతున్నారు. ఎందుకంటారా? సదరు ఓటరు పేరు మీద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 ఓట్లు ఉండటమే దీనికి కారణం. అతగాడి పేరు గురజా ప్రకాష్ రాజ్.

క్రిష్ణా.. గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను స్కాన్ చేస్తున్న అభ్యర్థులు ఒక పేరు దగ్గర ఆగిపోతున్నారు. కారణం.. సదరు పేరు మీద 42 ఓట్లు ఉండటమే. అయితే.. సదరు వ్యక్తి పేరుకు సంబంధించిన ఉన్న మిగిలిన ఓట్లలో వయసు.. ఇంటిపేరు.. డోర్ నెంబర్.. తండ్రి పేరు.. పోలింగ్ బూత్ వివరాలు మాత్రం వేరుగా ఉన్నాయి. దీంతో.. సదరు అభ్యర్థి ఎవరు? అతగాడి కేరాఫ్ అడ్రస్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

పెనమలూరు నియోజకవర్గం తాడిగడప పురపాలిక పరిధిలో ఉన్న గురజా ప్రకాష్ రాజ్ పేరుతో దరఖాస్తులన్నీ నమోదైనట్లుగా తేలింది. అయితే.. అన్నీ అడ్రస్ లను క్రాస్ చెక్ చేసినా.. 42 ఓట్లకు సంబంధించిన సదరు ప్రకాష్ రాజ్ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో అవాక్కు అవుతున్నారు అభ్యర్థుల. ఈ నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థికి చెందిన కొందరు మద్దతుదారులు సదరు ప్రకాష్ రాజ్ ఓట్లకు సంబంధించిన వివరాల మీద జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఒకే పేరు మీద 42 ఓట్లు ఉండటం ఒక విచిత్రమైతే.. సదరు ఓటరుకు సంబంధించిన ఏ అడ్రస్ లోనూ ఓటరు లేకపోవటం ఆశ్చర్యకరంగా మారింది.

Tags:    

Similar News