H4 టు H1B.. అమెరికాలో పొందడం సురక్షితమేనా?

H4 వీసా ద్వారా అమెరికాలో ప్రవేశించి H1B వీసాను అమెరికాలో అప్లై చేసి పొందడం సురక్షితమేనా? అన్న సందేహం వైరల్ అయ్యింది.

Update: 2025-02-28 04:30 GMT

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా పౌరసత్వం అనేది విదేశీయులకు అందని ద్రాక్షగా మారింది. అందరివీ రిజెక్ట్ చేస్తూ.. లూప్ హోల్స్ చూపిస్తూ ట్రంప్ వెళ్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో H1b పొందాలంటే ఏం చేయాలని ప్రవాస భారతీయులు, విదేశీయులు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. దీనికి ఒక నెటిజన్ కు వచ్చిన ఆలోచన అందరిలోనూ చర్చనీయాంశమైంది. H4 వీసా ద్వారా అమెరికాలో ప్రవేశించి H1B వీసాను అమెరికాలో అప్లై చేసి పొందడం సురక్షితమేనా? అన్న సందేహం వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో ఒక వినియోగదారు ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తారు. వారు H1B తోపాటు H4 రెండు వీసాలను కలిగి ఉన్నారు. H1B స్టాంప్డ్ అయినప్పటికీ దానిని ఉపయోగించి అమెరికాలో ప్రవేశించలేదు. H4 ఉపయోగించి కొంతకాలం అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు కొత్త ఉద్యోగ అవకాశంతో మార్చిలో H1B మీదుగా అమెరికాలోకి ప్రవేశించాలనుకుంటున్నారు. అయితే ఈ రకం ఉద్యోగులు అమెరికాలో చేరిన వెంటనే చేంజ్ ఆఫ్ స్టేటస్ (COS) కోసం అప్లై చేస్తే, USCIS సమస్యలను సృష్టించుతుందా? అన్న అనుమానాలు వారికి కలుగుతున్నాయి.

ఇక్కడ ప్రధానమైన సమస్య "ఇంటెంట్" తేడాగా ఉండడంతో ఇమిగ్రేషన్ సమస్యలు వస్తాయా? అన్న భయాలు నెలకొంటున్నాయి. H4 మీదుగా ప్రవేశించడం అంటే వారు ‘డిపెండెంట్’ ఉండాలనుకుంటున్నారని అర్థం. కానీ త్వరగా COS అప్లై చేస్తే, USCIS వారు ప్రవేశ సమయంలో వారి ఉద్దేశాన్ని తప్పుగా చూపారేమోనని సందేహించవచ్చు. దీనిలో 30/60/90 రోజుల నియమం అనేది కూడా వర్తించవచ్చు. 30 రోజుల్లోపు COS అప్లై చేస్తే అనుమానాస్పదంగా భావించే అవకాశముంది. 30-60 రోజుల మధ్య అస్పష్టత ఉంటుంది, కానీ 60 రోజుల తర్వాత అప్లై చేస్తే ప్రమాదం తక్కువ.

ఒక వ్యూహంగా కనీసం 30 రోజులు వేచి COS అప్లై చేయడం ఉత్తమం. లేకుంటే H1B ట్రాన్స్‌ఫర్ ఆమోదం పొందే వరకు ఇండియాలో ఉండటం కూడా ఒక ఎంపిక.. కాని అది అందరికీ ఇది అనుకూలంగా ఉండకపోవచ్చు.

ఇలాంటివి నైపుణ్యమైన వీసా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా అనుకోని సమస్యలను నివారించవచ్చు.

Tags:    

Similar News