ఇజ్రాయెల్ - పాలస్తీనా.. మధ్యలో మియా ఖలీఫా రచ్చ!
ఒకపక్క ఇజ్రాయేల్ - పాలస్తీనా యుద్ధం జరుగుతుంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ పై విచక్షణా రహితంగా రాకెట్లను ప్రయోగించారు
ఒకపక్క ఇజ్రాయేల్ - పాలస్తీనా యుద్ధం జరుగుతుంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ పై విచక్షణా రహితంగా రాకెట్లను ప్రయోగించారు. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రతిదాడిగా ఇజ్రాయేల్.. గాజా లక్ష్యంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంది. ఈ మధ్యలో ఎంటరయ్యింది ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా...! ఈ సందర్భంగా కొన్ని ట్వీట్లు చేసింది. ఇప్పుడు అది రచ్చగా మారింది!
అవును... ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఎంటరయ్యింది.. ఫలితంగా వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో భాగంగా... పాలస్తీనాకు మద్దతుగా పోస్టు చేసింది. హమాస్ ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోదులుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కెనడియన్ బ్రాడ్ కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ షాపిరో.. మియా ఖలీఫాను వ్యాపార ఒప్పందం నుండి తప్పించారు.
ఈ సందర్భంగా ఆమె ట్వీట్ పై స్పందించిన షపిరో... "ఇది చాలా భయంకరమైన ట్వీట్. మియా ఖలీఫా దయచేసి డెవలప్ అవ్వండి. మంచి మనిషిలా మారండి. ముఖ్యంగా తీవ్ర విషాదం ఎదురైనప్పుడు మనుషుల మధ్య శాంతి నెలకొనేలా స్పందించాలి. మీ అజ్ఞానానికి మాటలే లేవు. మీరు మంచి వ్యక్తిగా మారాలని నేను ప్రార్థిస్తున్నాను. మన బిజినెస్ డీల్ నుంచి మీరు తొలగింపబడ్డారు”అని ట్వీట్ చేశారు.
దీంతో షాపిరో ట్వీట్ కు మియా ఖలీఫా స్పందించింది. తన నిర్ణయంపై ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా రీట్వీట్ చేశారు. "పాలస్తీనాకు మద్దతు తెలిపి ఓ డీల్ ను మాత్రమే కోల్పోయాను. కానీ ఏ మాత్రం ఆరా తీయకుండా యుదులకు మద్దతు తెలిపే వ్యక్తితో డీల్ ఏర్పాటుకు సిద్ధమైనందుకు నాపైనే నాకు కోపంగా ఉంది" అంటూ రీ ట్వీట్ చేసింది.
ఇదే సమయంలో... తన ట్వీట్ హింసను ప్రేరేపించబోదని తెలిపిన మియా ఖలీఫా.. పాలస్తీనా ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని, అందుకే తాను స్వాతంత్య్ర సమరయోధులు అని పేర్కొన్ననని, పోరాడే ప్రజల పక్షానే తాను ఉంటానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాను లెబనాన్ నుంచి వచ్చినట్లు పేర్కొన్న మియా ఖలీఫా.. వలసవాదం వైపు ఉంటానని ఎలా ఆశిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
మరోవైపు ఇజ్రాయెల్ పై విచక్షణ కోల్పోయి దాడులు చేస్తున్న హమాస్ ముష్కరులను స్వాతంత్య్ర సమరయోధులుగా కీర్తిస్తూ ట్విట్టర్ లో మియా ఖలీఫా పోస్టు చేయడంపై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేన్ని స్వాగతించాలో, దేన్ని తిరస్కరించాలో తెలియకపోవడానికి మించిన అజ్ఞానం లేదని మియా ఖలీఫా ఎప్పటికి తెలుసుకుంటారో అని కామెంట్ చేస్తున్నారు.
కాగా... హమాస్ ఉగ్రవాదులు మొదలుపెట్టిన ఈ యుద్ధంపై ఇజ్రాయేల్ ధీటుగా స్పందిస్తుంది. ఇప్పటికే గాజాను అష్టదిగ్భందనం చేసిన ఇజ్రాయేల్ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపింది.