బాబోయ్! ఫ్లైట్‌లో కూడా వేధింపా? ఈసారి మనోడే దొరికిపోయాడు!

శుక్లా నివసించే న్యూజెర్సీలో అతడిని అరెస్టు చేశారు. విచారణ కోసం అతన్ని మోంటానాకు తరలిస్తారు.;

Update: 2025-04-09 04:13 GMT
బాబోయ్! ఫ్లైట్‌లో కూడా వేధింపా? ఈసారి మనోడే దొరికిపోయాడు!

అమెరికాలో ఒక ఫ్లైట్‌లో దారుణం జరిగింది. మోంటానా నుండి టెక్సాస్‌కు వెళ్తున్న విమానంలో ఒక భారత సంతతి వ్యక్తి తోటి ప్రయాణికురాలిని లైంగికంగా వేధించాడని అధికారులు తెలిపారు. భావేష్‌కుమార్ దహ్యాభాయ్ శుక్లా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఆయన ఏప్రిల్ 17న కోర్టులో హాజరుకానున్నాడు.

శుక్లా నివసించే న్యూజెర్సీలో అతడిని అరెస్టు చేశారు. విచారణ కోసం అతన్ని మోంటానాకు తరలిస్తారు. 36 ఏళ్ల శుక్లాను విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి భర్త అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు.

మోంటానా ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 26న బెల్‌గ్రేడ్, మోంటానా నుండి డల్లాస్, టెక్సాస్‌కు వెళ్తున్న విమానంలో భావేష్‌కుమార్ దహ్యాభాయ్ శుక్లా రెండుసార్లు ఆ మహిళను అసభ్యంగా తాకాడట.

మొదట ఆమె "తొడలు, పిరుదులు, నడుము కింది భాగాన్ని" తాకాడని, ఆమె నిరసించడంతో ఆపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, మళ్లీ ఆమెను తాకాడని, తన కోటును అడ్డుగా పెట్టుకుని ఆమెను తాకరాని చోట రుద్దాడని బాధితురాలు చెప్పింది.

ఈ దాడిని మరో ప్రయాణికుడు కూడా ధృవీకరించాడు. అరెస్టు సమయంలో భావేష్‌కుమార్ దహ్యాభాయ్ శుక్లా తనకు ఇంగ్లీష్ రాదని చెప్పాడు. కానీ ఫిర్యాదు ప్రకారం అతను ఆ మహిళతో, ఆమె కుమార్తెతో ఇంగ్లీష్‌లో మాట్లాడాడు.

Tags:    

Similar News